అక్షరటుడే, భీమ్గల్: MLA Prashath Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) కొడంగల్ సభలో చేసిన వ్యాఖ్యలు ఆయనలోని నిరాశ, నిస్పృహలను ప్రతిబింబిస్తున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (MLA Vemula Prashanth Reddy) ధ్వజమెత్తారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ (KCR), కేటీఆర్లపై (KTR) ముఖ్యమంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ప్రజలకు చేసిన మేలు ఏమీ లేకపోవడంతోనే రేవంత్ రెడ్డి బజారు భాషలో మాట్లాడుతున్నారని విమర్శించారు.
MLA Prashath Reddy | ఓటమి భయంతోనే పిచ్చి వాగుడు
ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో (Sarpanch elections) తెలంగాణ ప్రజలు 4,000కు పైగా బీఆర్ఎస్ మద్దతుదారులను గెలిపించడంతో సీఎంకు ‘మైండ్ బ్లాక్’ అయ్యిందని వేముల అన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు కాంగ్రెస్ పాలనపై ఎంత విసుగు చెందారో ఈ ఫలితాలే నిదర్శనమన్నారు. ఆ భయంతోనే రేవంత్ రెడ్డి పిచ్చి వాగుడు వాగుతున్నారని మండిపడ్డారు.
MLA Prashath Reddy | ముఖ్యమంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి వాడిన పదజాలాన్ని ప్రశాంత్ రెడ్డి అదే స్థాయిలో తిప్పికొట్టారు. “నీ నెత్తిలో మొత్తం పెండ నిండి ఉంది. కాబట్టే, నీ పేడమూతితో బోడిలింగం వంటి మాటలు మాట్లాడుతున్నావు” అని ఘాటుగా వ్యాఖ్యానించారు. రెండు లక్షల రుణమాఫీ విషయంలో దేవుళ్లపై ఒట్లు వేసి ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డికి, నీతి గురించి మాట్లాడే అర్హత లేదని దుయ్యబట్టారు.
MLA Prashath Reddy | అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?
పాలమూరు ప్రాంతాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS government) పడావు పెట్టిందన్న ఆరోపణలను ప్రశాంత్ రెడ్డి తిప్పికొట్టారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల, కల్వకుర్తి, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులను పరుగులు పెట్టించింది కేసీఆర్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. “నిజంగా రేవంత్ రెడ్డికి దమ్ముంటే అసెంబ్లీలో ప్రతిపక్షాల మైక్ కట్ చేయకుండా సాగునీటి రంగంపై చర్చకు రావాలి. అప్పుడు ఎవరు ఏం చేశారో తేలుతుంది” అని వ్యాఖ్యానించారు.
MLA Prashath Reddy | ప్రజలు బండకేసి కొట్టడం ఖాయం
ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి వ్యక్తిగత దూషణలకు దిగడం రాజకీయ దిగజారుడుతనానికి పరాకాష్ట అని ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని బండకేసి కొట్టడం ఖాయమని.. రేవంత్ రెడ్డికి భంగపాటు తప్పదని హెచ్చరించారు.