అక్షర టుడే, లింగంపేట : Lingampet | ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని పొల్కంపేటలో (Polkampet) చౌదరి చెరువు, మత్తడి కుంట తెగిపోయాయి. దీంతో జల వనరుల శాఖ రాష్ట్ర చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ (Water Resources Department ENC Srinivas) శుక్రవారం గ్రామాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోతకు గురైన చెరువులు, కుంటలకు త్వరలోనే మరమ్మతు పనులు చేపడతామని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో (Yellareddy constituency) ధ్వంసమైన చెరువులు, కుంటల మరమ్మతులకు అంచనాలు రూపొందించి, ప్రతిపాదనలు పంపించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కామారెడ్డి చీఫ్ ఇంజినీర్ యశస్విని, ఈఈ మల్లేష్, డీఈఈ వెంకటేశ్వర్లు, ఏఈ సతీష్ పాల్గొన్నారు.