Homeలైఫ్​స్టైల్​Chickpeas | శనగలు.. ప్రయోజనాలు బోలెడు.. గుప్పెడు గింజలతో గుండెకెంతో మేలు

Chickpeas | శనగలు.. ప్రయోజనాలు బోలెడు.. గుప్పెడు గింజలతో గుండెకెంతో మేలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Chickpeas | చాలా మందికి చిరుతిళ్లు తినే అలవాటు ఉంటుంది. అయితే ఎక్కువగా జంక్‌ ఫుడ్ (Junk food) తీసుకుంటూ ఉంటారు.

పానీపూరీలు, సమోసాలు, మిర్చీలు, ఇతర వేయించిన తినుబండారాలు, బిస్కట్లు, బేకరీ ఐటమ్స్‌ (Bakery items), పిజ్జాలు, బర్గర్లు తింటుంటారు. కానీ, ఇవి ఆరోగ్యానికి హాని చేస్తాయన్న విషయాన్ని మాత్రం మర్చిపోతుంటారు. జంక్‌ ఫుడ్‌ తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. దీంతో ఒబెసిటీ(Obesity), గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ జంక్‌ ఫుడ్‌కు బదులుగా ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు డైటీషియన్లు. ముఖ్యంగా శనగలు (Chickpeas) తింటే బోలెడు ప్రయోజనాలు ఉంటాయంటున్నారు. శనగలను తీసుకునే విధానం, ప్రయోజనాలు తెలుసుకుందామా..

Chickpeas | ఇలా తీసుకోవాలి..

నల్ల శనగలను నీటిలో కాసేపు నానబెట్టాలి. అనంతరం వాటిని ఉడికించి తినాలి. లేదా ఉడికించిన శనగలపై పచ్చి ఉల్లిపాయలు వేసి, నిమ్మకాయ పిండి, ఉప్పు, కారం చల్లి తింటే రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. శనగలను పొట్టు తీయకుండా తింటే శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. వీటిని మొలకల రూపంలో తిన్నా కూడా ప్రయోజనాలుంటాయి. బాదంలో ఎన్ని పోషకాలు ఉంటాయో.. శనగలలోనూ అన్ని ఉంటాయంటారు.

Chickpeas | పోషకాలు.. ప్రయోజనాలు..

శనగల్లో పీచు పదార్థం (High Fiber content) ఎక్కువగా ఉంటుంది. ఇది కొలస్ట్రాల్‌ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. దీంతో గుండె జబ్బుల ప్రమాదం తక్కువగా ఉంటుంది.
శనగలు తినడం వల్ల కడుపు నిండినట్లుగా ఉంటుంది. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది అధిక బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది.

ఇందులోని ఫైబర్‌ జీర్ణశక్తిని కూడా మెరుగు పరుస్తుంది. నల్ల శనగల్లో క్యాల్షియం(calcium food), మెగ్నిషియం, ఫాస్పరస్‌ అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎముకల సాంద్రతను పెంచుతాయి. ఆస్టియోపోరోసిస్‌ వంటి ఎముకల వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. నల్ల శనగల్లో ఉండే ఫైబర్‌ చెడు కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌)ను తగ్గిస్తూ, మంచి కొలెస్ట్రాల్‌ (హెచ్‌డీఎల్‌)ను పెంచుతుంది.

వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు బీపీ తగ్గేలా చూస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. నల్ల శనగల గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ చాలా తక్కువ. వీటిని తిన్న వెంటనే రక్తంలో షుగర్‌ లెవల్స్‌ పెరగవు. కనుక డయాబెటిస్‌ (Best Diabetic Food) ఉన్నవారు వీటిని తీసుకోవచ్చు.నల్ల శనగల్లో జింక్‌ (High Zinc foods) అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను (immunity power food) పటిష్టంగా మారుస్తుంది. వీటిలోని ఆల్ఫా లినోలెనిక్‌ యాసిడ్‌, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ను తగ్గించడంలో ఉపయోగపడతాయి.

ఇందులోని అమినో యాసిడ్స్‌, ట్రైప్టోఫాన్‌, సెరోటొనిన్‌ వంటి విటమిన్స్‌ మంచినిద్రను అందిస్తాయి. కాబట్టి నిద్రలేమితో బాధపడేవారు శనగలు రెగ్యులర్‌గా తినడం మంచిది.
వీటిలో వృక్ష సంబంధ ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. నాన్‌ వెజ్‌ తినని వారు ప్రొటీన్(Veg Protein food)ల కోసం నల్ల శనగలను తీసుకుంటే మంచిది.

Chickpeas | 100 గ్రాముల శనగలలో ఉండే పోషక విలువలు..

శక్తి : 364 కిలో క్యాలరీలు
ప్రొటీన్‌: 20 గ్రాములు
కార్బోహైడ్రేట్లు: 61 గ్రాములు
ఫైబర్‌ : 17 గ్రాములు
కొవ్వు : 6 గ్రాములు
కాల్షియం: 105 ఎంజీ
ఐరన్‌ : 6.7 ఎంజీ
మెగ్నిషియం : 115 ఎంజీ
ఫాస్పరస్‌ : 356 ఎంజీ
పొటాషియం : 718 ఎంజీ
జింక్‌ : 2.9 ఎంజీ
విటమిన్‌ C: 4 ఎంజీ
థైమిన్‌ : 0.4 ఎంజీ
రైబోఫ్లావిన్‌ : 0.2 ఎంజీ
నియాసిన్‌ : 2.6 ఎంజీ