అక్షరటుడే,బోధన్ : Chickpea Crop Damage | అకాల వర్షాలు శనగ పంట రైతుల్లో గుబులు రేపుతున్నాయి. జిల్లాలో ఉదయం జిల్లాలో వర్షం కురియడంతో రైతులు (Farmers) ఆందోళన చెందుతున్నారు.
Chickpea Crop Damage | అల్పపీడన నేపథ్యంలో..
రాష్ట్రంలో అల్పపీడన నేపథ్యంలో వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో సోమవారం ఉదయం తేలికపాటి వర్షం కురిసింది. అయితే మండల వ్యవసాయ అధికారులు ముందస్తుగానే సామాజిక మాద్యమాల్లో వర్ష సూచనలను విడుదల చేశారు. జిల్లాలో వందల ఎకరాల్లో శనగపంట సాగైంది. కోతలయ్యాక విక్రయాలకు కోసం పంటను సిద్ధం చేసుకున్నారు. అయితే అధికారుల సూచన మేరకు రైతులు పంటపై తాటిపత్రులు కప్పి జాగ్రత్త పడ్డారు. అయినప్పటికీ కొద్దిమేర పంట తడిసింది. భారీ వర్షాలు (Heavy Rains) కురిస్తే తమ పరిస్థితి ఏమిటని రైతులు ఆందోళన చెందుతున్నారు.
మరో రెండురోజులపాటు తేలికపాటి వర్షాలు..
అల్పపీడనం కారణంగా మరో రెండు రోజులపాటు జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు (Meteorological Department Officers) పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వర్షాలు లేకపోతే తమ పంటను విక్రయాలకు సిద్ధం చేసుకునేవారమని వారు తెలిపారు.
