అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nandigama | దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబడుతున్న ఈ సమయంలో, ఎన్టీఆర్ జిల్లా నందిగామ(Nandigama)లో జరిగిన ఒక ఘటన చర్చనీయాంశంగా మారింది.
సాధారణంగా గణేష్ నవరాత్రుల(Ganesh Navratri) సందర్భంగా భక్తులు సాత్వికంగా పూజలు నిర్వహిస్తూ, శాఖాహార అన్నదాన కార్యక్రమాలను నిర్వహించడం మనం చూస్తూనే ఉంటాం. కానీ నందిగామలో గణేష్ మండపం సమీపంలో మాంసాహార భోజనాలు ఏర్పాటు చేయడం తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ భోజన కార్యక్రమాన్ని గణేష్ మండప నిర్వాహకులు కాకుండా, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా, స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు(YSRCP Leaders) నిర్వహించటం గమనార్హం.
Nandigama | మనోభావాలు దెబ్బ తీసారు…
మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ (MLC Arun Kumar) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, వైఎస్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించిన తర్వాత, గణేష్ మండపానికి అతి సమీపంలోనే చికెన్ బిర్యానీ(Chicken Biryani) విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో పార్టీ కార్యకర్తలకు భోజనం వడ్డించారు.ఈ విషయంపై మండప నిర్వాహకులు, భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “వినాయక మండపం పక్కనే మాంసాహార విందు ఎలా పెడతారు?” అని స్థానికులు ప్రశ్నించినప్పటికీ, నిర్వాహకులు పట్టించుకోలేదన్న ఆరోపణలు వచ్చాయి.
విషయం పోలీసులకు తెలియజేయగా, స్థానిక సీఐ(Nandigama CI) తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని, విందు కార్యక్రమంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం అక్కడ ఉన్న వాటర్ క్యాన్లు, ఇతర విందు సరుకులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై భక్తుల మనోభావాలను గాయపరిచేలా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటూ, అరుణ్ కుమార్, జగన్మోహనరావు సహా మరో 20 మందిపై ఎస్సై శాతకర్ణి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.