Homeక్రీడలుRajat Patidar | ర‌జ‌త్ చేసిన త‌ప్పిదం.. కిరాణ కొట్టు వ్య‌క్తికి విరాట్‌, డివిలియ‌ర్స్ నుండి...

Rajat Patidar | ర‌జ‌త్ చేసిన త‌ప్పిదం.. కిరాణ కొట్టు వ్య‌క్తికి విరాట్‌, డివిలియ‌ర్స్ నుండి ఫోన్ కాల్స్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Rajat Patidar | ఆర్‌సీబీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) కెప్టెన్ రజత్ పటీదార్ (RCB Captain Rajat Patidar) చేసిన చిన్నపాటి నిర్లక్ష్యం.. కిరాణ షాపుదారుడిని ఒక్కసారిగా సోషల్ మీడియా హీరోగా మార్చేసింది. ఏకంగా విరాట్ కోహ్లీ (Virat Kohli), ఏబీ డివిలియర్స్‌ (AB de Villiers) వంటి దిగ్గజ ఆటగాళ్ల ఫోన్‌కాల్స్ రిసీవ్ చేసుకోవ‌డం ఆయనకు ఊహించని అనుభూతిని ఇచ్చింది.

చత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) గరియాబంద్ జిల్లాకు చెందిన మనీష్ అనే వ్యక్తి, తన స్నేహితుడు ఖేమ్ రాజ్‌తో కలిసి ఇటీవల కొత్త సిమ్‌కార్డ్ (New Sim Card) తీసుకున్నాడు. మనీష్ కిరాణ కొట్టు న‌డుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే తాను తీసుకున్న‌ సిమ్‌ యాక్టివేట్‌ చేసి వాట్సాప్‌ ఓపెన్ చేసిన వెంటనే ప్రొఫైల్ పిక్చర్‌లో రజత్ పటీదార్ ఫొటో రావడంతో ఆశ్చర్యపోయాడు. తొలుత ఇది సాంకేతిక లోపమని పెద్దగా పట్టించుకోలేదు.

Rajat Patidar | వారు అని తెలియ‌క‌..

అయితే, కొద్ది క్షణాల్లోనే ఆ నంబర్‌కు విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ నుంచి వాట్సాప్ కాల్స్, వీడియో కాల్స్ (Video Calls) రావడంతో అయోమయానికి లోనయ్యాడు. ఇది ప్రాంక్ అని భావించిన మనీష్ (Manish), ఆ ఫోన్లను పట్టించుకోలేదు. దాంతో రజత్ పటీదార్‌ స్వయంగా కాల్ చేసి ఆ నంబర్ తనదేనని, తక్షణమే తిరిగి ఇచ్చ‌యాలని కోరాడు. అయితే ప్రాంక్‌ అనుకున్న మనీష్..నేను ర‌జ‌త్‌ని అన్న‌ప్పుడు వెంట‌నే “నేను ధోనీని!” అంటూ సరదాగా సమాధానమిచ్చాడు. కానీ తాను నిజంగా రజత్ పటీదార్‌నేనని, ప్రముఖుల నుంచి ఫోన్లు వస్తున్నాయని, కావాలంటే పోలీసులను పంపిస్తానని హెచ్చరించాడు.

ఆ మాటలు చెప్పిన పది నిమిషాల్లోనే పోలీసులు మనీష్ ఇంటికి చేరుకోవడంతో అతడు, ఖేమ్ రాజ్ ఇద్దరూ షాక్ అయ్యారు. అప్పుడే నిజం గ్రహించి సిమ్‌ను వెంటనే రజత్ పటీదార్‌కు తిరిగిచ్చారు. అయితే విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌తో మాట్లాడినందుకు, ఇది నా జీవితంలోని గొప్ప రోజు అంటూ మనీష్, ఖేమ్ రాజ్ ఆనందంతో ఊగిపోయారు.అయితే ఇలా జ‌ర‌గ‌డానికి కార‌ణం.. రజత్ పటీదార్ 90 రోజులుగా తన పాత నంబర్‌ను ఉపయోగించకపోవడంతో, టెలికాం కంపెనీ (telecom company) ఆ నెంబర్‌ను తిరిగి సర్క్యులేషన్‌లోకి తీసుకువచ్చి ఇత‌రుల‌కి కేటాయిస్తారు. ఈ క్ర‌మంలోనే ఆ నంబర్ మనీష్‌కు కేటాయించబడింది. ఈ విషయం తెలియకనే కోహ్లీ (Virat Kohli), డివిలియర్స్ పాత స్నేహితుడితో మాట్లాడాల‌ని ఆ నంబర్‌కు కాల్స్ చేశారు.మొత్తానికి ఈ విచిత్ర ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వినోదాన్ని పంచుతోంది.

Must Read
Related News