అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Chhattisgarh encounter | ఛత్తీస్‌గఢ్‌లో గురువారం (సెప్టెంబరు 11) భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా బలగాలకు జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు నాయకుడు మోడెం బాలకృష్ణ అలియాస్ మనోజ్ (Maoist leader Modem Balakrishna) సహా పది మంది నక్సలైట్లు హతమయ్యారు.
ఎన్కౌంటర్ కొనసాగుతున్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) గరియాబంద్ జిల్లాలో మావోల కదలికల గురించి పక్కా సమాచారం అందుకున్న భద్రతా దళాలు కూంబింగ్ ప్రారంభించాయి.
ఈ క్రమంలో మోయిన్పూర్ పోలీసుస్టేషన్ (Moinpur police station) పరిధిలోని అడవుల్లో తారసపడిన నక్సల్స్ కాల్పులు ప్రారంభించగా.. భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి.
Chhattisgarh encounter | కీలక నేత హతం..
ఈ కాల్పుల్లో మావోయిస్టు నాయకుడు మోడెం బాలకృష్ణ అలియాస్ మనోజ్‌తో పాటు మరో తొమ్మిది మంది నక్సలైట్లు (Naxalites) మృతి చెందారు.
అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న మనోజ్ కోసం బలగాలు ఎప్పటి నుంచో వేట కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో ఆయన హతమయ్యాడు.
అయితే, ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతున్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని రాయ్‌పూర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అమ్రేష్ మిశ్రా తెలిపారు.
నక్సల్స్ సమాచారం అందుకున్న బలగాలు కూంబింగ్ చేస్తున్న సమయంలో మావోలు కాల్పులు జరిపారని చెప్పారు.
“స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్ – CRPF ఎలైట్ యూనిట్), ఇతర రాష్ట్ర పోలీసు విభాగాలకు చెందిన సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.
కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. క్షేత్రస్థాయి నుంచి అందిన సమాచారం ప్రకారం కనీసం ఎనిమిది మంది నక్సలైట్లను కాల్చి చంపారు” అని మిశ్రా వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్నారు.