అక్షరటుడే, కామారెడ్డి : Chhatrapati Shivaji Jayanti Celebrations | ఛత్రపతి శివాజీ భారత జాతి వీరత్వానికి ప్రతీక అని ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి అన్నారు. పట్టణంలోని ఇంటర్నేషనల్ హోటల్ (International Hotel) సమీపంలో ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా శివాజీ విగ్రహానికి (Shivaji Statue) పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భారత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు అని కొనియాడారు. యువతరానికి, తరతరాలకు పౌరుషాగ్నిని రగిలించే దిక్సూచి ఛత్రపతి శివాజీ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Chhatrapati Shivaji Jayanti Celebrations | ఆర్యక్షత్రియ సంఘం ఆధ్వర్యంలో..
మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో (Devunipalli Village) ఆర్యక్షత్రియ సంఘం ఆధ్వర్యంలో శివాజీ విగ్రహానికి సంఘం అధ్యక్షుడు చిన్నోళ్ల రామకృష్ణారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కామారెడ్డి మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ కాసర్ల గోదావరి స్వామి పాల్గొని ఛత్రపతి శివాజీ పోరాట పటిమను కొనియాడారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఛత్రపతి శివాజీ నవతరానికి ఆదర్శమన్నారు.
Chhatrapati Shivaji Jayanti Celebrations | శివాజీతోనే అఖండ భారతదేశం..
ఛత్రపతి శివాజీ లేకపోతే నేడు ఈ అఖండ భారతదేశం ఉండేది కాదని, దేవాలయాలు, హిందూధర్మం ఉండేది కాదని వైస్ ఛైర్పర్సన్ అన్నారు. భావి తరాలకు అఖండ భారతాన్ని అంకితం చేయడానికి తన జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు ఛత్రపతి శివాజీ (Chhatrapati Shivaji) అని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. అనంతరం గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో దేవునిపల్లి ఆర్యక్షత్రియ సంఘం అధ్యక్షుడు చిన్నోళ్ల రామకృష్ణ రావు, ఉపాధ్యక్షుడు నిట్టు గోపాల్ రావు, ప్రధాన కార్యదర్శి ఇస్రోజీవాడి బాపురావు, జిల్లా నాయకుడు అంబీర్ మనోహర్ రావు, సంఘం సభ్యులు రవీందర్ రావు, లింగారావు, రజనీకాంత్ రావు, వీడీసీ అధ్యక్షుడు గంగారాం తదితరులు పాల్గొన్నారు.