Homeజిల్లాలుకామారెడ్డిSambhaji Maharaj | ఘనంగా ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ జయంతి

Sambhaji Maharaj | ఘనంగా ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ జయంతి

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sambhaji Maharaj | పట్టణంలోని గాంధీచౌక్‌లో (Gandhi Chowk) ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. వీహెచ్‌పీ (VHP), బజరంగ్‌దళ్‌(Bajrang Dal) ఆధ్వర్యంలో శంభాజీ మహారాజ్‌ (Sambhaji Maharaj) చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ.. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ పరాక్రమాన్ని పుణికిపుచ్చుకున్న మహావీరుడు శంభాజీ మహారాజ్​ అని అన్నారు. నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌ దళ్‌ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News