Homeక్రైంChevella Accident | చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. ముగ్గురు అక్కా చెల్లెళ్ల మృతి

Chevella Accident | చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. ముగ్గురు అక్కా చెల్లెళ్ల మృతి

చేవెళ్ల బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. హైదరాబాద్​లో చదువుకుంటున్న అక్కాచెల్లెళ్లు చనిపోయారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Chevella Accident | చేవెళ్ల బస్సు ప్రమాదం అనేక కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఉదయాన్నే వివిధ పనుల నిమిత్తం హైదరాబాద్​ (Hyderabad) వెళ్తున్న వారిని కంకర లారీ రూపంలో మృత్యువు కబళించింది.

ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెళ్లెళ్లు మృతి చెందారు. వికారాబాద్ జిల్లా (Vikarabad District) యాలాల మండలం పేర్కంపల్లి గ్రామానికి చెందిన నందిని, సాయి ప్రియ, తనూష ప్రమాదంలో మృతి చెందారు. వీరు ముగ్గురు హైదరాబాద్​లో చదువుతున్నారు. ఇటీవల హైదరాబాద్ నుంచి స్వగ్రామం వచ్చారు. సోమవారం ఉదయం ​తిరిగి వెళ్తుండగా.. రోడ్డు ప్రమాదంలో (Road Accident) చనిపోయారు.

పేర్కంపల్లికి (Perkampally) చెందిన ఎల్లయ్యగౌడ్​కు నలుగురు కమార్తెలు. పెద్ద కూతురు వివాహం అయింది. మిగతా ముగ్గురు చదువుకుంటున్నారు. నందిని డిగ్రీ ఫస్టియర్​, సాయి ప్రియ డిగ్రీ ఫైనలియర్​, తనూష ఎంబీఏ చదువుతున్నారు. వీకెండ్​ కావడంతో వారు స్వగ్రామానికి వచ్చారు. ముగ్గురిని తండ్రి బస్సు ఎక్కించి వెళ్లాడు. అంతలోనే వారు ప్రమాదంలో మృతి చెందారు. నవ్వుతూ సరదాగా వెళ్లిన ముగ్గురు కూతుర్లు.. ఒకేసారి చనిపోవడంతో వారి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.

Chevella Accident | మృతుల వివరాలు..

బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్​ (Minister Ponnam Prabhakar) తెలిపారు. మృతుల వివరాలను అధికారులు వెల్లడించారు. డ్రైవర్ దస్తగిరి బాబా, లారీ డ్రైవర్‌తో పాటు ఏడుగురు పురుషులు, 12 మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. గుర్తించిన మృతుల్లో తారిబాయ్ (45), కల్పన (45), బచ్చన్ నాగమణి (55), గుర్రాల అభిత (21), గోగుల గుణమ్మ, ఏమావత్ తాలీబామ్, మల్లగండ్ల హనుమంతు, తబస్సుమ్ జహాన్, షేక్ ఖలీద్ హుస్సేన్ ఉన్నారు.