Homeతాజావార్తలుCherry Vox farmhouse | ఫామ్​ హౌస్​ డ్రగ్స్ పార్టీ.. 50 మంది ఇంటర్​ విద్యార్థులు..

Cherry Vox farmhouse | ఫామ్​ హౌస్​ డ్రగ్స్ పార్టీ.. 50 మంది ఇంటర్​ విద్యార్థులు..

తెలంగాణ రాజధాని​లో డ్రగ్స్ పట్టివేతలు ఇటీవల కలకలం రేపుతున్నాయి. డ్రగ్స్, గంజాయి వినియోగం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్లు తెలుస్తున్నా..  జీహెచ్​ఎంసీ పరిధిలోనే ప్రభుత్వం ఈగల్​ టీమ్​ను ఫామ్​ చేయడంతో​ గ్రేటర్​ హైదరాబాద్​లో తరచూ కేసులు వెలుగుచూస్తున్నట్లు తెలుస్తోంది. 

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: Cherry Vox farmhouse | తెలంగాణ రాజధాని​ (Telangana capital) లో డ్రగ్స్ పట్టివేతలు ఇటీవల కలకలం రేపుతున్నాయి. డ్రగ్స్, గంజాయి వినియోగం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్లు తెలుస్తున్నా..  జీహెచ్​ఎంసీ GHMC పరిధిలోనే ప్రభుత్వం ఈగల్​ టీమ్​ (Eagle Team) ను ఫామ్​ చేయడంతో​ గ్రేటర్​ హైదరాబాద్​ (Greater Hyderabad) లో తరచూ కేసులు వెలుగుచూస్తున్నట్లు తెలుస్తోంది.

వారాంత సెలవుల్లో పబ్, ఫామ్ హౌస్ అంటూ తేడా లేకుండా యువత డ్రగ్స్ మత్తులో మునిగి తేలుతున్న కేసులు బయటపడుతున్నాయి.

యువత బలహీనతను క్యాష్ చేసుకునేందుకు అక్రమార్కులు ఇంస్టాగ్రాం వంటి సోషల్ మీడియా social media ను వాడుకుంటున్నారు. తాజాగా మరో డ్రగ్స్ కేసు వెలుగుచూసింది.

మహా నగర శివారులోని మొయినాబాద్​లో ఉన్న ఓ ఫామ్ హౌస్​లో రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు (Rajendranagar SOT police) తనిఖీలు చేపట్టగా.. విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.

Moinabad చెర్రీ వోక్స్ ఫామ్ హౌస్​లో తలపెట్టిన డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఇక్కడ 50 మంది ఇంటర్ స్టూడెంట్స్ గుర్తించి షాక్​ అయ్యారు. వీరి వద్ద నుంచి భారీగా డ్రగ్స్, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే ఈ ఫామ్​హౌస్​లో జరిగిన డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నవారంతా ఇంటర్ విద్యార్థులే కావడం చర్చనీయాంశంగా మారింది.

Cherry Vox farmhouse | అమ్మాయిలు కూడా..

వారంతా 15, 17 ఏళ్ల మైనర్​ బాలలు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటన తమ పిల్లలపై పేరెంట్స్ కేరింగ్​ ఏ విధంగా ఉందో తెలియజేస్తోంది.

కాగా, డ్రగ్స్ పార్టీ నిర్వాహకుడు కిషన్ తో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వీరు ఇంస్టాగ్రామ్​లో ట్రాప్ హౌస్ పేరుతో ఐడీ క్రియేట్ చేసినట్లు విచారణలో తేలింది.

దాని ద్వారా డ్రగ్స్ పార్టీ (drug party) పై ప్రచారం చేసినట్లు తెలిసింది. ఈ పార్టీ నిర్వహణ కోసం ఆన్​లైన్​లో ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.1300 వసూలు చేసినట్లు విచారణలో వెల్లడైంది.

డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన వారిలో 14 మంది అమ్మాయిలు, 35 మంది అబ్బాయిలు ఉన్నారు. వీరిలో ఇద్దరికి డ్రగ్స్ పాజిటివ్​ నిర్ధారణ అయింది. వీరంతా మాదాపూర్, గచ్చిబౌలి, నార్సింగ్, కూకట్​పల్లి, కేపీహెచ్​పీ ప్రాంతాల వారిగా గుర్తించారు.