KKR vs CSK | చెన్నై విజయం.. ప్లే ఆఫ్స్ నుంచి కేకేఆర్ ఔట్?
KKR vs CSK | చెన్నై విజయం.. ప్లే ఆఫ్స్ నుంచి కేకేఆర్ ఔట్?

అక్షరటుడే, వెబ్​డెస్క్:KKR vs CSK | ఐపీఎల్(IPL) 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) తమ పరాజయల పరంపరకు ఎట్టకేలకు బ్రేక్ వేసింది. వరుసగా నాలుగు ఓటముల తర్వాత విజయం సాధించింది.

బుధవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌(Kolkata Knight Riders)తో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో చెన్నై 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆఖరి ఓవర్‌లో మహేంద్ర సింగ్ ధోనీ(Mahendra Singh Dhoni) సిక్స్ బాది చెన్నై విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ ఓటమితో కేకేఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఆ జట్టు చివరి రెండు మ్యాచ్‌లు గెలిచినా టోర్నీలో ముందు అడుగు వేయలేని పరిస్థితిని తెచ్చుకుంది.

180 పరుగుల లక్ష్యచేధనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 19.4 ఓవర్లలో 8 వికెట్లకు 183 పరుగులు చేసి గెలుపొందింది. డెవాల్డ్ బ్రెవిస్(Dewald Brevis)(25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. అరంగేట్ర ప్లేయర్ ఉర్విల్ పటేల్(Urvil Patel)(11 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 31)మెరుపులు మెరిపించాడు. శివమ్ దూబే(Shivam Dube)(40 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 45 నాటౌట్), ధోనీ(Dhoni)(17 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా(Vaibhav Arora)(3/48) మూడు వికెట్లు తీసినా ఫలితం లేకపోయింది. హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తీ రెండేసి వికెట్లు తీయగా.. మోయిన్ అలీకి ఓ వికెట్ దక్కింది.

అంతకుముందు కేకేఆర్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 179 పరుగులు చేసింది. అజింక్యా రహానే(Ajinkya Rahane)(33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48), ఆండ్రీ రస్సెల్(Andre Russell)(21 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 38), మనీష్ పాండే(Manish Pandey)(28 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 36 నాటౌట్) రాణించారు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్(Noor Ahmed)(4/31) నాలుగు వికెట్లతో కేకేఆర్ పతనాన్ని శాసించాడు. అన్షుల్ కంబోజ్, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీసారు.