ePaper
More
    Homeఅంతర్జాతీయంAfghanistan earthquake | ఆఫ్ఘ‌నిస్తాన్ భూకంపంపై చెన్నై సూపర్ కింగ్స్ ఎమోష‌న‌ల్ ట్వీట్.. మా హృద‌యం...

    Afghanistan earthquake | ఆఫ్ఘ‌నిస్తాన్ భూకంపంపై చెన్నై సూపర్ కింగ్స్ ఎమోష‌న‌ల్ ట్వీట్.. మా హృద‌యం ముక్క‌లైంది..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Afghanistan earthquake | ఆఫ్ఘ‌నిస్థాన్‌ను భారీ భూకంపం కుదిపేసింది. నంగర్‌హార్, కునార్ ప్రాంతాల్లో రాత్రి 11:47 గంటలకు సంభవించిన ఈ ప్రకృతి విలయం వేలాది జీవితాలపై ప్రభావం చూపింది. 6.0 తీవ్రతతో నమోదైన ఈ భూకంపంలో ఇప్పటివరకు 800కుపైగా ప్రాణనష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు.

    ముఖ్యంగా కునార్‌ జిల్లాలో (Kunar district) 812 మంది మరణించినట్టు ప్రభుత్వ ప్రతినిధి మౌలావి జబీహుల్లా ముజాహిద్ పేర్కొన్నారు. మరో 3000 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. భూకంప కేంద్రం జలాలాబాద్ నగరానికి 27 కిలోమీటర్ల దూరంలో నమోదు కావడంతో, పర్వత ప్రాంతాల్లో ప్రజలు తీవ్రంగా బాధపడ్డారు. విరిగిపడిన కొండచరియలు, దెబ్బతిన్న రహదారులు సహాయక చర్యలకు తీవ్ర అడ్డంకిగా మారాయి.

    Afghanistan earthquake | 800కి పైగా..

    శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీయేందుకు రెస్క్యూ టీమ్‌లు (Rescue teams) తంటాలు పడుతున్నాయి.ఈ విషాద నేపథ్యంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) స్పందించింది. అఫ్గాన్ ప్రజలకు మద్దతుగా ఎక్స్ (ట్విటర్) వేదికగా ఓ హృద్యమైన సందేశాన్ని షేర్ చేస్తూ, వారి బాధను పంచుకుంది. ఆఫ్ఘ‌నిస్తాన్ సోదరులు, సోదరీమణులారా మీ భూభాగాన్ని వణికించిన ఈ విపత్తు వార్త విని మా హృదయాలు ముక్కలయ్యాయి. ఈ కష్ట సమయంలో మీరు మానసిక నిబ్బరం, ఆశతో ముందుకెళ్లాలని ప్రార్థిస్తున్నాం. దేవుడు మీకు శాంతి ప్రసాదించాలని కోరుకుంటున్నాం అని సోష‌ల్ మీడియాలో పోస్ట్ (Social Media Post) చేశారు.

    అఫ్గాన్ క్రికెటర్లు (Afghan cricketers) గతంలో ఐపీఎల్‌ IPLలో, ముఖ్యంగా సీఎస్‌కే తరఫున ఆడారు. ప్రస్తుతం యువ స్పిన్నర్ నూర్ అహ్మద్ (Noor Ahmed) చెన్నై జట్టులో ఉన్నాడు. ముక్కోణపు సిరీస్ సందర్భంగా అఫ్గాన్, యూఏఈ క్రికెటర్లు మైదానంలో మౌనం పాటిస్తూ భూకంప బాధితులకు ఘన నివాళులర్పించారు. అంతేకాదు, తమ మ్యాచ్ ఫీజుతో పాటు విరాళాలు కూడా బాధిత కుటుంబాలకు అందిస్తామని ప్రకటించారు. ఈ భారీ భూకంపం తర్వాత సహాయక చర్యలు మరింత వేగంగా జ‌రగాల్సిన‌ అవసరం కనిపిస్తోంది. పర్వత ప్రాంతాల్లో ప్రజల ప్రాణాలను కాపాడే క్రమంలో సహాయ బృందాలకు విస్తృత వనరులు, జాగ్రత్తలు అవసరం.

    More like this

    Indiramma houses | వేగంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం.. పెరిగిన ధరలతో లబ్ధిదారుల ఇబ్బందులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indiramma houses | పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని...

    Gold Price | ఆల్ టైమ్ హైకి చేరుకున్న ప‌సిడి ధ‌ర‌.. ఇక సామాన్యుల‌కి క‌ష్ట‌కాల‌మే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gold Price | నగల ప్రియులకు, పెట్టుబడిదారులకు మరోసారి షాక్‌. బంగారం  ధరలు రోజు...

    Pawan Kalyan | నిన్ను చంప‌డానికి వ‌స్తున్నా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ర్త్ డే గ్లింప్స్ అదుర్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా, ఆయన...