HomeజాతీయంChennai | జిప్ తీసి ప్రైవేట్ పార్ట్ చూపించిన యువ‌కుడు.. చిత‌క‌బాదిన పారిశుధ్య కార్మికురాలు

Chennai | జిప్ తీసి ప్రైవేట్ పార్ట్ చూపించిన యువ‌కుడు.. చిత‌క‌బాదిన పారిశుధ్య కార్మికురాలు

చెన్నైలో జరిగిన ఓ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. బహిరంగ ప్రదేశంలో అసభ్యంగా ప్రవర్తించిన ఓ యువకుడిని, విధులు నిర్వహిస్తున్న 50 ఏళ్ల పారిశుధ్య కార్మికురాలు చితకబాదింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Chennai | చెన్నై నగరంలో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బహిరంగ ప్రదేశంలో అసభ్యంగా ప్రవర్తించిన ఓ యువకుడిని, విధులు నిర్వహిస్తున్న 50 ఏళ్ల పారిశుధ్య కార్మికురాలు (Sanitation Worker) అక్కడికక్కడే చితకబాదిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఉదయం వేళ చెన్నైలోని (Chennai) ఒక ప్రాంతంలో పారిశుధ్య పనులు చేస్తున్న మహిళ వద్దకు ఓ యువకుడు హెల్మెట్ ధరించి బైక్‌పై వచ్చాడు. ఆ తర్వాత ప్యాంట్ జిప్ తీసి ప్రైవేట్ భాగం చూపించే ప్రయత్నం చేశాడు. ఈ దృశ్యం చూసి షాక్ అయిన ఆ పారిశుధ్య కార్మికురాలు వెంటనే తన చేతిలో ఉన్న చీపురుతో అతడిపై దాడి చేసి తీవ్రంగా కొట్టింది. దాంతో భయపడ్డ ఆ యువకుడు అక్కడి నుంచి తేరుకుని పారిపోయాడు.

Chennai | పోలీసుల విచారణ ప్రారంభం

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో (Social Media) వైరల్‌గా మారిన నేపథ్యంలో స్థానిక పోలీసులు  స్వయంగా కేసు నమోదు చేశారు. వీడియో ఫుటేజ్ ఆధారంగా ఆ బైకర్‌ను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి. మొదట అతను చిన్నవాడిలా కనిపించాడు. కాలేజీ విద్యార్థి అయి ఉంటాడని అనుకున్నాను. కానీ దగ్గరికి వెళ్లగానే అతను తన జిప్ తీశాడు. నేను షాక్ అయ్యాను. వెంటనే చీపురుతో కొట్టడంతో అతను అక్కడినుంచి పారిపోయాడు” అని ఆ మహిళ తెలిపింది.

మహిళల పట్ల బహిరంగ ప్రదేశాల్లో అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. తెల్లవారుజామున పనిచేసే పారిశుధ్య సిబ్బందికి అదనపు భద్రత కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు తెలిపారు. ఈ ఘటనపై నెటిజన్లు కూడా స్పందిస్తూ.. “ఆమె ధైర్యానికి సెల్యూట్”, “మహిళలు తమ భద్రత కోసం ఇలాగే తిరిగి ఎదురు తిర‌గాలి” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Must Read
Related News