ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Chengalpattu Express | సిగ్నల్ కేబుల్ కట్ చేసి.. ఎక్స్‌ప్రెస్ రైలులో నిలువు దోపిడీ

    Chengalpattu Express | సిగ్నల్ కేబుల్ కట్ చేసి.. ఎక్స్‌ప్రెస్ రైలులో నిలువు దోపిడీ

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Chengalpattu Express : సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్ర‌యాణికులు రైళ్లలో గ‌మ్య‌స్థానాల‌కు వెళుతుంటారు. అయితే, చిక్కిందే ఛాన్స్ అనుకుని దొంగలు రెచ్చిపోతున్నారు. ప్రయాణికులు మంచి నిద్రలో ఉన్న సమయంలో అదును చూసి దోచుకుంటున్నారు. ముఖ్యంగా మహిళా ప్రయాణికుల్ని టార్గెట్ చేస్తున్నారు దొంగలు.. వారి దగ్గరున్న బంగారాన్ని దోచేస్తున్నారు. ఇటీవలే ప‌ద్మావ‌తి ఎక్స్‌ప్రెస్‌లో దొంగ‌లు చేసిన దోపిడీ మ‌రవ‌క ముందే.. తాజాగా మ‌రో ట్రైన్‌లో భారీ దోపిడీ జ‌రిగింది.

    Chengalpattu Express : మ‌ళ్లీ దోపిడీ..

    పద్మావతి ఎక్స్‌ప్రెస్ రైలులో (Padmavati Express train) జ‌రిగిన చోరీలో ముగ్గురు మహిళల నుంచి మొత్తం 40 గ్రాముల బంగారం, రూ.వేలు, ఒక మొబైల్ దొంగిలించారు. వేకువజామున సమయంలో రైలు నెమ్మదిగా వెళ్తుండడంతో దొంగలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ చోరీ ఘటన కలకలం రేపింది. ఇక ఇప్పుడు ముంబయి (Mumbai to Chennai train) నుంచి చెన్నై వెళ్తున్న చెంగల్పట్టు ఎక్స్‌ప్రెస్ (chengalpattu express train) రైలులో ఈ తెల్లవారుజామున భారీ దోపిడీ జరిగింది. అనంతపురం జిల్లా (Anantapur district) పరిధిలోని తాడిపత్రి (Tadipatri city) పట్టణానికి సమీపంలో ఉన్న కోమలి రైల్వే స్టేషన్ దాటిన తర్వాత దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. పథకం ప్రకారం దుండగులు రైల్వే సిగ్నల్ వ్యవస్థకు చెందిన కేబుల్‌ను కత్తిరించారు.

    దీంతో సిగ్నల్ అందక రైలు మార్గమధ్యలోనే నిలిచిపోయింది. రైలు ఆగిన వెంటనే కొందరు దుండగులు రైలు బోగీల్లోకి ప్రవేశించి ప్రయాణికులను బెదిరించి వారి వద్దనున్న నగదు, బంగారు ఆభరణాలు దోచుకున్నారు. తెల్లవారుజామున జరిగిన ఈ పరిణామంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దోపిడీ అనంతరం దుండగులు చీకటిలో పరారయ్యారు. ఈ దోపిడీ ఘటనపై బాధిత ప్రయాణికులు రేణిగుంట రైల్వే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో రైలు ప్రయాణాల్లో ప్రయాణికుల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

    More like this

    Mohan Bhagwat | భారత్ అంటే భయపడే సుంకాలు.. అమెరికా తీరును ఎండగట్టని మోహన్ భగవత్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mohan Bhagwat | భారతదేశం బలంగా అభివృద్ధి చెందితే తమకు ఏమి జరుగుతుందోనని అమెరికాకు...

    Stock Market | ఎనిమిది సెషన్లుగా నిఫ్టీ పైపైకి.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Domestic Stock Markets) లాభాల బాటలో పయనిస్తున్నాయి....

    Collector Nizamabad | సెంట్రల్ డ్రగ్స్ స్టోర్​ను తనిఖీ చేసిన కలెక్టర్

    అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | జిల్లా కేంద్రంలోని గంగాస్థాన్​లో ఉన్న సెంట్రల్ డ్రగ్స్ స్టోర్​ను (Central Drugs...