అక్షరటుడే, భీమ్‌గల్ : Mahesh Kumar Goud | భీమ్‌గల్ మండలం చేంగల్ గ్రామ (Chengal village) నూతన సర్పంచ్‌గా ఎన్నికైన దుమాల రాజు పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను (PCC President Mahesh Kumar Goud) బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం గ్రామంలోని పలు అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల గురించి పీసీసీ అధ్యక్షుడికి వివరించారు. చేంగల్ గ్రామ సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందించాలని కోరారు. దీనిపై మహేష్ కుమార్ గౌడ్ సానుకూలంగా స్పందిస్తూ.. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నూతన ప్రజాప్రతినిధులు క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు గ్రామ ముఖ్య నాయకులు, అనుచరులు పాల్గొన్నారు.