అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Railway Station | ఢిల్లీలో బాంబు పేలుళ్ల (Delhi bomb blasts) నేపథ్యంలో దేశం మొత్తం కేంద్ర హోంశాఖ (Union Home Ministry) హైఅలర్ట్ ప్రకటించింది. ఈ మేరకు రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. అనుమానిత వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టారు.
జిల్లాలో పోలీసులు అలర్ట్ అయ్యారు. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో (railway station) పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. సికింద్రాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ (Secunderabad Circle Inspector Srinivas), నిజామాబాద్ రైల్వేస్టేషన్ ఎస్‌హెచ్‌వో సాయారెడ్డి (Nizamabad Railway Station SHO Sayareddy) ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్లో మంగళవారం తనిఖీలు చేశారు. స్టేషన్లో ప్లాట్‌ఫాంలతో పాటు, పార్సల్ సెక్షన్, అనుమానాస్పద వస్తువులను తనిఖీ చేశారు.
