ePaper
More
    HomeతెలంగాణTraffic problem | ట్రాఫిక్​ సమస్యకు చెక్​.. రోడ్లపై ఆక్రమణల తొలగింపు

    Traffic problem | ట్రాఫిక్​ సమస్యకు చెక్​.. రోడ్లపై ఆక్రమణల తొలగింపు

    Published on

    అక్షరటుడే, ఇందూరు : Traffic problem | నగరంలో (Nizamabad city) దశాబ్దాలుగా ఏర్పడిన ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రోడ్లను ఆక్రమించి వ్యాపారం చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ముందస్తుగా హెచ్చరించి రోడ్లపై ఆక్రమణలను తొలగిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన వారికి నోటీసులు అందజేస్తున్నారు.

    జిల్లా కేంద్రంలో నిత్యం వేలాది సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. చుట్టుపక్కల జిల్లాలు, గ్రామాల నుంచి వేల మంది ఆయా పనుల నిమిత్తం నగరానికి వస్తుంటారు. దీంతో వాహనాల రద్దీ (heavy traffic) అధికంగా ఉంటుంది. అసలే నగరంలోని రోడ్లన్నీ చిన్నగా ఉండటం.. అందులో కొందరు వ్యాపారస్తులు రోడ్డును ఆక్రమించడంతో సమస్య మరింత ఎక్కువైంది. ముఖ్యంగా ఖలీల్​వాడి, దేవీ రోడ్, గాంధీ గంజ్, బస్టాండ్ రోడ్, గాంధీ చౌక్, పెద్ద బజార్, బోధన్ రోడ్, అహ్మద్ పురా కాలనీ, అంగడి బజార్, ఖిల్లా రోడ్ తదితర ప్రధాన రోడ్లలో ట్రాఫిక్​ సమస్య తీవ్రంగా ఉంటుంది.

    Traffic problem | రద్దీ అధికంగా ఉన్న రోడ్లపై..

    ట్రాఫిక్ పోలీసులు (Traffic police) నగరంలో 15 రోజుల నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉన్న రోడ్లపై దృష్టి సారించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (Police Commissioner Sai Chaitanya), ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ సమస్య పరిష్కారానికి ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రధాన రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. అలాగే రోడ్లపై వ్యాపారస్తులు అక్రమంగా ఏర్పాటు చేసిన షెడ్డు, సామగ్రిని తొలగింప చేస్తున్నారు. గాంధీ చౌక్ నుంచి గాంధీ గంజి వరకు, అహ్మద్ పుర కాలనీ, శంభునిగుడి, అంగడి బజార్, ఆర్ఆర్ చౌరస్తా, ప్రగతి నగర్ తదితర ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఆక్రమణలను తొలగించారు.

    Traffic problem | శంభుని గుడి వద్ద ఉద్రిక్తత

    నగరంలో ట్రాఫిక్ సమస్యకు (traffic problem) చెక్ పెట్టాలంటే అందరి సహకారం అవసరం. అయితే శుక్రవారం శంభుని గుడి ప్రాంతంలో ఆక్రమణలను తొలగించే సమయంలో పలువురు అక్కడికి చేరుకొని ట్రాఫిక్ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో ట్రాఫిక్ పోలీసులు రెండో టౌన్​ పీఎస్​లో కేసులు నమోదు చేశారు.

    Traffic problem | ఖలీల్​వాడిలో..

    ఇందూరులో అత్యధికంగా రద్దీ ఉండే ప్రాంతాల్లో ఖలీల్​వాడి ఒకటి. ఇక్కడ సుమారు 300కు పైగా ప్రైవేట్ ఆస్పత్రలు (private hospitals) ఉంటాయి. అయితే ఈ ప్రాంతంలో చాలావరకు రోడ్లు ఆక్రమణలకు గురయ్యాయి. డ్రెయినేజీపై నిర్మాణాలు చేపట్టారు. సెట్ బ్యాక్ లేకుండా అనేక నిర్మాణాలు ఉన్నాయి. అలాగే పార్కింగ్ వ్యవస్థ లేకపోవడంతో తీవ్ర సమస్యలు ఏర్పడుతున్నాయి. కేవలం ఖలీల్​వాడిలోనే కాకుండా ఇందూరులోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. దీంతో మూడు రోజులుగా నగర పాలక సంస్థ అధికారులు పలువురికి నోటీసులు అందజేస్తున్నారు. నిజానికి నిర్మాణ సమయంలోనే టౌన్ ప్లాన్ అధికారులు పర్యవేక్షించి అనుమతులు ఇవ్వాలని, అలాకాకుండా సమస్య జటిలమైనప్పుడే నోటీసులు ఇవ్వడం సమంజసం కాదనే విమర్శలు వస్తున్నాయి.

    Traffic problem | శాశ్వతంగా సమస్యను పరిష్కరించాలి

    ‌– గంగాధర్, నగరవాసి

     

    నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇది శాశ్వతంగా ఉండేలా చూడాలి. ఇందుకు వ్యాపారస్తులు కూడా సహకరించాలి. అలా కాకుండా మూన్నాళ్ల ముచ్చటగా మారకూడదు.

    Traffic problem | నిరంతర ప్రక్రియ

    – పబ్బ ప్రసాద్, ట్రాఫిక్ సీఐ

    ప్రజా సమస్యలను దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్​ను నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇది నిరంతర ప్రక్రియ. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే 39 (బీ) పోలీస్ యాక్ట్, 41(ఏ) సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటాం. నగరవాసులు, వ్యాపారస్తులు సహకరించాలి.

    More like this

    Eagle Team | ముంబైలో ఈగల్​ టీమ్​ స్పెషల్​ ఆపరేషన్​.. డ్రగ్స్​, హవాలా రాకెట్​ గుట్టురట్టు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Eagle Team | ముంబైలో తెలంగాణ (Telangana) ఈగల్​ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్​ చేపట్టారు....

    Stock Market | నిలదొక్కుకునేనా? లాభాల బాటలో దేశీయ మార్కెట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | గ్లోబల్‌ మార్కెట్లు (Global markets) పాజిటివ్‌గా ఉండడంతో మన మార్కెట్లు...

    Mahalaya Paksham | మహాలయ పక్షం.. పితృదేవతలకు ప్రీతికరమైన కాలం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mahalaya Paksham | భాద్రపద మాసంలో బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్న...