HomeUncategorizedHDFC Bank | హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ సీఈవోపై చీటింగ్ కేసు.. ఎందుకో తెలుసా!

HDFC Bank | హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ సీఈవోపై చీటింగ్ కేసు.. ఎందుకో తెలుసా!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :HDFC Bank | దేశంలోని దిగ్గజ ప్రైవేట్​ బ్యాంక్​ హెచ్​డీఎఫ్​సీ సీఈవోపై చీటింగ్​ కేసు(Cheating Case) నమోదు అయినట్లు తెలుస్తోంది. ఆయన ఆర్థిక మోసాలకు పాల్పడ్డారని ఓ ట్రస్ట్ ఆరోపించింది. లీలావతి కిర్తీలాల్ మెహతా మెడికల్ ట్రస్ట్ (ఎల్‌‌‌‌కేఎంఎం ట్రస్ట్) లీలావతి హాస్పిటల్‌‌‌‌ను నడుపుతుంది. ఈ ట్రస్ట్​ హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ సీఈవో శశిధర్ జగదీశన్(HDFC Bank CEO Shashidhar Jagadeesan) ఆర్థిక మోసానికి పాల్పడ్డాడని ఆరోపించింది.

హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్ బోర్డ్, ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ(RBI), సెబీ, ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్లు జగదీశన్‌‌‌‌ను సస్పెండ్​ చేసి వెంటనే విచారణ చేపట్టాలని ట్రస్ట్​ డిమాండ్​ చేసింది. రూ.14.42 కోట్లు ట్రస్టీలు కొట్టేశారని, అందులో రూ.2.05 కోట్లు జగదీశన్‌‌‌‌కు వెళ్లాయని ఆరోపించింది. ఈ మేరకు ట్రస్ట్​ కోర్టు(Court)ను ఆశ్రయించడంతో ఆయనపై కేసు నమోదైంది.

కాగా లీలావతి ట్రస్ట్(Lilavati Trust)​ సభ్యుల మధ్య కొంతకాలంగా వివాదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో రెండు దశాబ్దాల్లో రూ.1,250 కోట్ల విలువైన ఆర్థిక మోసం జరిగిందనే ఆరోపణలపై లీలావతి హాస్పిటల్‌‌‌‌కు చెందిన 7 మాజీ ట్రస్టీలు, మరో 10 మందిపై  ఫిర్యాదులు అందాయి.
హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ సీఈవోపై వచ్చిన ఆరోపణలను బ్యాంక్​ ఖండించింది. దీనిపై బ్యాంక్ స్పోక్స్‌‌‌‌పర్సన్ వివరణ ఇచ్చారు. ట్రస్ట్, దాని ట్రస్టీలు, ఆఫీసర్స్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని  పేర్కొన్నారు. ఎల్‌‌‌‌కేఎంఎం ట్రస్టీ ప్రశాంత్ మెహతా(LKMM Trustee Prashant Mehta), అతని ఫ్యామిలీ మెంబర్స్ బ్యాంక్‌‌‌‌కు చాలా డబ్బు బాకీ ఉన్నారని తెలిపారు.

Must Read
Related News