ePaper
More
    HomeసినిమాChava Movie | రూ.600 కోట్ల క్ల‌బ్‌లోకి చావా

    Chava Movie | రూ.600 కోట్ల క్ల‌బ్‌లోకి చావా

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Chava Movie |  విక్కీ కౌశల్ Vicky Kaushal, రష్మిక మందన్న Rashmika Mandanna నటించిన చావా Chava చిత్రం మ‌రో రికార్డు సాధించింది. బంప‌ర్ హిట్‌కొట్టిన ఈ సినిమా తాజాగా రూ.600 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టిన జాబితాలో చేరింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ Chhatrapati Shivaji Maharaj కుమారుడు మరాఠా యోధుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ Chhatrapati Shambhaji Maharaj జీవితం ఆధారంగా రూపొందించబడిన ఈ చారిత్రక చిత్రం ఇండియాలో రూ.600 కోట్ల మార్కును దాటింది. పుష్ప 2, స్త్రీ 2 తర్వాత ఈ మైలురాయిని చేరుకున్న మూడో చిత్రంగా చావా నిలిచింది. ఇది ఈ మార్కును చేరుకున్న రెండవ బాలీవుడ్ చిత్రం.

    Chava Movie | బాలీవుడ్‌లో భారీ విజ‌యం..

    అట్ట‌ర్‌ఫ్లాప్‌ల‌తో బాలీవుడ్‌లో నిరాశపూరిత‌మైన వాతావ‌ర‌ణం నెల‌కొన్న త‌రుణంలో చావా విజ‌యం బీ-టౌన్‌కు ఊపిరి పోసిన‌ట్ల‌యింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన చావా బలమైన పాత్రల చిత్రీకరణ, ఆకట్టుకునే సినిమాటోగ్రఫీ, అత్యుత్తమ ప్రదర్శనలతో ఆ సినిమా బంప‌ర్ హిట్ కొట్టింది. ఇప్ప‌టిదాకా హిందీలో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన సినిమాలో పుష్ప‌-2 రూ.812.14 కోట్లతో మొద‌టి స్థానంలో ఉండ‌గా, స్ట్రీ 2 రూ597.99 కోట్లు, చావా రూ.585.43 కోట్లతో త‌ర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఆత ర్వాత జ‌వాన్ రూ.582.31 కోట్లు, గదర్-2 రూ.525.7 కోట్లు, పఠాన్ రూ.524.53 కోట్లు, బాహుబలి-2 రూ.510.99 కోట్లు, యానిమల్ రూ.502.98 కోట్లు, కేజీఎఫ్-2 రూ.435.33 కోట్లు, దంగల్ రూ.374.43 కోట్ల క‌లెక్ష‌న్లు సాధించాయి.

    Chava Movie | చిత్ర‌బృందం వేడుకలు..

    రూ.600 క్ల‌బ్‌లోకి చేర‌వ‌డంతో చావా చిత్ర‌బృందం వేడుక‌లు Film crew celebrations జ‌రుపుకుంది. “600 నాట్ అవుట్, చావా రూ600 కోట్ల మార్కును దాటింది. పుష్ప 2 హిందీ, స్ట్రీ 2 తర్వాత, చావా ఈ మైలురాయిని చేరుకున్న మూడవ చిత్రం ఇది. ఆల్-టైమ్ బ్లాక్‌బస్టర్ All-time blockbuster. చావాకి ఇంత ప్రేమను అందించినందుకు షుకర్ రబ్ దా తే సబ్ దా Thank you very much, everyone.. (దేవునికి మరియు మీ అందరికీ కృతజ్ఞతలు)” షామ్ చిత్రం రూపొందించిన పోస్టర్‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.

    More like this

    Shobha Yatra | శోభాయాత్ర ప్రారంభం.. గట్టి బందోబస్తు.. కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణ

    అక్షరటుడే, కామారెడ్డి : Shobha Yatra : కామారెడ్డి పట్టణంలో గణేష్ శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. ఆనవాయితీ ప్రకారం...

    Betting app case | బెట్టింగ్ యాప్​ వేధింపులకు మరో యువకుడు బలి

    అక్షరటుడే, కామారెడ్డి : Betting app case | ఆన్​లైన్​ బెట్టింగ్ జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. ఈజీగా డబ్బు...

    GPO | రెవెన్యూశాఖపై అవినీతి ముద్రను తొలగించే బాధ్యత జీపీవోలదే : సీఎం రేవంత్​

    అక్షరటుడే, హైదరాబాద్: GPO | అవినీతికి పాల్పడుతారని సమాజం ముందు దోషిగా రెవెన్యూ శాఖ మీద పడిన ముద్రను...