అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ChatGPT | ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ప్రతి పనిని చిటికెలో చేసి పెడుతోంది. విద్యార్థుల హోం వర్క్ నుంచి మొదలు పెడితే.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ల కోడింగ్ వరకు ఏఐ చేయగలదు. దీంతో ఏఐకి అలవాటు పడిన ప్రజలు.. అది కాసేపు పనిచేయకపోతే ఆందోళన చెందుతున్నారు. ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ చాట్ జీపీటీ(ChatGPT) సేవల్లో మంగళవారం అంతరాయం కలిగింది. దీంతో యూజర్లు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు.
ChatGPT | ప్రపంచవ్యాప్తంగా..
ప్రస్తుతం ఉన్న ఏఐ టూల్స్‌లో చాట్ జీపీటీ ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం నుంచి సర్వర్ డౌన్ కావడంతో యాప్ పనిచేయలేదు. ఈ ఏడాది చాట్ జీపీటీ సేవలు నిలిచిపోవడం ఇది రెండోసారి. మధ్యాహ్నం 2.45 నుంచి భారత్ (India)లో చాట్ జీపీటీ సేవలకు అంతరాయం కలిగిందని వందల సంఖ్యలో యూజర్లు ఫిర్యాదు చేశారు. భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా చాట్ జీపీటీ సేవలు స్తంభించిపోయాయి అని తెలుస్తోంది. కాగా సేవల్లో అంతరాయంపై చాట్ జీపీటీ సంస్థ స్పందించింది. కొందరు యూజర్లకు అంతరాయం కలిగిందని, సమస్య పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించింది.