అక్షరటుడే, భిక్కనూరు: Chappan Bhog Sweets | మండలంలోని వాసవీమాత ఆలయంలో దుర్గానవరాత్రి ఉత్సవాలు (Durganavaratri celebrations) కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం వాసవీమాతను భక్తులు లక్ష్మీదేవిగా కొలిచారు. ఈ సందర్భంగా అమ్మవారికి చప్పన్ భోగ్ (Chappan Bhog) (56 రకాలు) నైవేద్యాలు సమర్పించారు.
Bhikanoor | భక్తిశ్రద్ధలతో కుంకుమార్చనలు..
ఆలయంలో మహిళలు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో కుంకుమార్చనలు (kumkumkarchana) చేశారు. పూజారి నవీన్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సిద్ధరామేశ్వర ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం కోశాధికారి చికోటి వెంకటేశం, ప్రతినిధులు పబ్బ నాగరాజు, పబ్బ జగన్నాథం, కోడిప్యాక ఆంజనేయులు, పురం రాజమౌళి, శనిశెట్టి శ్రీనివాస్, రాజలింగం, గంగెల్లి మధు, వెంకటేశం, నాగార్జున, చంద్రమౌళి, సిద్దగిరి, బంక్ శ్రీనివాస్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.