అక్షరటుడే, వెబ్‌డెస్క్: Chaos in Rajya Sabha | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. లోక్‌సభ, రాజ్యసభలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) నరవాణే పుస్తకం గురించి చేసిన వ్యాఖ్యల ప్రకంపనలు ఆగడం లేదు. ఈ క్రమంలో గురువార రాజ్యసభలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే మధ్య మాటల యుద్ధం సాగింది. లోక్‌సభలో రాహుల్ గాంధీని మాట్లాడనివ్వలేదని ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ అంటే కేంద్రం భయపడుతోందన్నారు. దీనిపై నడ్డా స్పందించారు. లోక్‌సభ అంశాలను ఇక్కడ ప్రస్తావించొద్దన్నారు. ప్రధాని మోదీ (Prime Minister Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం (Central Government) ఎలాంటి చర్చకైనా సిద్ధమని స్పష్టం చేశారు.
Chaos in Rajya Sabha | సభ ఎలా పనిచేస్తోంది
రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) మాట్లాడుతూ, పార్లమెంటు లోక్‌సభ, రాజ్యసభ రెండింటినీ కలిగి ఉంటుందన్నారు. లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జాతీయ ప్రయోజనానికి సంబంధించిన అంశాలపై మాట్లాడాలని అనుకోగా.. అనుమతి ఇవ్వలేదన్నారు. అలాంటి సభ ఎలా పనిచేయగలదని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి జె.పి. నడ్డా (Union Minister J.P. Nadda) స్పందిస్తూ లోక్‌సభ కార్యకలాపాలను రాజ్యసభలో చర్చించలేమని స్పష్టం చేశారు.
Chaos in Rajya Sabha | లోక్‌సభలో..
లోక్‌సభలో గురువారం ఉదయం కూడా కొనసాగింది. సభ ప్రారంభమైన ఒక నిమిషంలోనే విపక్ష సభ్యుల ఆందోళనతో స్పీకర్ వాయిదా వేశారు. బుధవారం జరిగిన సంఘటనపై స్పీకర్ ఓం బిర్లా అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు (Union Minister Kiren Rijiju) మాట్లాడుతూ.. సభ ఎవరి ఇష్టానుసారం కాదు, నిబంధనల ప్రకారం పనిచేస్తుందన్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడికి స్పీకర్ దాదాపు 40 నిమిషాల సమయం ఇచ్చారని, కానీ పదే పదే నిబంధనలకు మించి మాట్లాడారని గుర్తు చేశారు.