అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Parliament | పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (Parliament’s winter session) కొనసాగుతున్నాయి. సోమవారం సభ ప్రారంభం కాగానే.. అధికార, విపక్ష పార్టీల సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు స్పీకర్ వాయిదా వేశారు.
దేశంలో ఓటు చోరీ జరుగుతోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం మహాధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ధర్నాలో ప్రధానిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) పలు వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు సభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభ, రాజ్యసభలో (Lok Sabha and Rajya Sabha) బీజేపీ నేతల ఆందోళన చేపట్టారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీకి సమాధి తవ్వాలంటూ ధర్నాలో నినాదాలు చేశారని, ప్రధానిని చంపాలని పిలుపునిచ్చారా అంటూ కాంగ్రెస్‌పై బీజేపీ నాయకులు మండిపడ్డారు.
Parliament | విషాదకరమైన సంఘటన
ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా కాంగ్రెస్ కార్యకర్తలు బెదిరింపు నినాదాలు చేశారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. దీనికి రాహుల్ గాంధీ, ఖర్గే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ర్యాలీలో కొంతమంది పార్టీ కార్యకర్తలు ప్రధాని సమాధి తవ్వుతామని బెదిరించారని, ఇది భారత ప్రజాస్వామ్యంలో జరిగిన అత్యంత దురదృష్టకరమైన, విషాదకరమైన సంఘటన అన్నారు.
Parliament | ఉపాధి హామీ బిల్లు
కేంద్ర ప్రభుత్వం ఎంజీఎన్ఆర్ఈజీఏను రద్దు చేసి, గ్రామీణ ఉపాధి కోసం ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్)’ అనే కొత్త చట్టాన్ని తీసుకు వస్తున్నట్లు గతంలో ప్రకటించింది. ఈ మేరకు కొత్త బిల్లును సోమవారం సభలో ప్రవేశ పెట్టనుంది. కొత్త బిల్లు చట్ట రూపం దాలిస్తే ప్రస్తుతం ఉన్న ఉపాధి హామీ పని దినాలు 100 రోజుల నుంచి 125 రోజులకు పెరుగుతాయి. ఈ పథకానికి నిధుల పంపిణీలో రాష్ట్రాల వాటాను కూడా చేర్చడంతో రాష్ట్రాల ఖజానాపై అధిక ఆర్థిక భారాన్ని మోపే అవకాశం ఉంది.