అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Warangal Congress | వరంగల్ కాంగ్రెస్‌లో మరోసారి రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కొంతకాలంగా అక్కడ వర్గపోరు నెలకొన్న విషయం తెలిసిందే. మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) దంపతులు, ఉమ్మడి జిల్లాలోని ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పొసగడం లేదు.
మంత్రి సురేఖ, ఆమె భర్త కొండా మురళి గతంలో పలువురు ఎమ్మెల్యే (Congress MLA)లపై వ్యాఖ్యలు చేశారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి (MLA Revuri Prakash Reddy)పై మురళి తీవ్ర విమర్శలు చేశారు. అనంతరం కొండా సురేఖ సైతం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డిపై పలు ఆరోపణలు చేశారు. దీంతో పలువురు కాంగ్రెస్ నేతలు కొండా దంపతులకు వ్యతిరేకంగా గ్రూప్ కట్టారు. ఈ క్రమంలో తాజాగా కొండా ఫ్యామిలీని పలువురు అనుచరులు వీడుతుండటం గమనార్హం.
Warangal Congress | ఎమ్మెల్సీ గూటికి..
ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య గూటికి కీలక నేతలు చేరారు. కొండా అనుచరునిగా ఉన్న వరంగల్ డీసీసీ ఆయూబ్ సారయ్య వర్గంలో చేరడం గమనార్హం. కొండా వీరాభిమానిగా ఉన్న నల్గొండ రమేష్ సైతం కొండా వర్గంతో తెగదింపులు చేసుకున్నారు. కొండా వ్యతిరేక వర్గమైన ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య గ్రూపులో ఆయన చేరారు. రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు (Municipal Elections) జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో కొండా ఫ్యామిలీ, ఎమ్మెల్సీ సారయ్య మధ్య ఆధితప్య పోరు నడుస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.
Warangal Congress | కొండా సురేఖ అనుచరుడిపై కేసు
మంత్రి కొండా సురేఖ ప్రధాన అనుచరుడు నవీన్ రాజ్‌పై కేసు నమోదు అయింది. 25వ డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సాజిద్‌పై నవీన్ రాజ్ దాడి చేశాడు. నవీన్ రాజ్ తీరుపై వాట్సాప్ గ్రూపుల్లో ఆడియోలు పెట్టినందుకు తనను కత్తితో బెదిరించి, దాడి చేశారని ఫిర్యాదు చేసిన బాధితుడు ఫిర్యాదు చేశాడు. దీంతో నవీన్ రాజ్‌తో పాటు అతని అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.