అక్షరటుడే, వెబ్డెస్క్: Hyderabad Police | రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల హైదరాబాద్ నగరంలో (Hyderabad city) కొత్తగా మరో పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసింది. అలాగే రాచకొండ కమిషనరేట్ (Rachakonda Commissionerate) పేరు, పరిధి మార్చింది.
గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad) పరిధిలో గతంలో మూడు కమిషనరేట్లు ఉండేవి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు ఉండగా.. ప్రభుత్వం ఇటీవల ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ (Future City Commissionerate) ఏర్పాటు చేసింది. అలాగే రాచకొండ కమిషనరేట్ తొలగించి, దాని స్థానంలో మల్కాజ్గిరి కమిషనరేట్ ఏర్పాటు చేసింది. తాజాగా గతంలో రాచకొండ పరిధిలో కొనసాగిన ఠాణాలను ప్రస్తుతం రీ ఆర్గనైజ్ చేసింది.
Hyderabad Police| హైదరాబాద్ పరిధిలోకి..
గతంలో రాచకొండ సీపీ పరిధిలో ఉన్న ఆదిభట్, పహడీ షరీఫ్, బాలాపూర్, మీర్పేట్ పోలీస్ స్టేషన్లను హైదరాబాద్ కమిషనరేట్లో విలీనం చేసింది. ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల్, హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ, మద్గుల్, కందుకూరు, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం ట్రాఫిక్, మహేశ్వరం ట్రాఫిక్, డీసీపీ మహేశ్వరం జోన్, అడిషనల్ డీసీపీ మహేశ్వరం జోన్, ఇబ్రహీంపట్నం ఏసీపీ, మహేశ్వరం ఏసీపీ, మహేశ్వరం ట్రాఫిక్ డివిజన్ ఏసీపీ కార్యాలయాలను ఫ్యూచర్ సిటీ కమిషరేట్ పరిధిలోకి ప్రభుత్వం మార్చింది. అలాగే యాద్రాద్రి భువనగిరి జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లు గతంలో రాచకొండ పరిధిలో ఉండేవి. ఇక నుంచి ఆయా ఠాణాలు భువనగిరి ఎస్పీ పరిధిలోకి వెళ్తాయి. ఈ మేరకు మల్కాజ్గిరి సీపీ అవినాష్ మహంతి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.