Homeటెక్నాలజీUPI Service | యూపీఐ సేవ‌ల్లో మార్పులు.. ఆగ‌స్టు నుంచి 1 నుంచి కొత్త రూల్స్‌

UPI Service | యూపీఐ సేవ‌ల్లో మార్పులు.. ఆగ‌స్టు నుంచి 1 నుంచి కొత్త రూల్స్‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: UPI Service | ప్ర‌స్తుత రోజుల్లో న‌గ‌దు లావాదేవీలు త‌గ్గిపోయి, ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్స్ పెరిగి పోయాయి. యూపీఐ (Unified Payments Interface) ద్వారా చెల్లింపులు రెట్టింప‌య్యాయి. ఏ వ‌స్తువు కొనాల‌న్నా, ఎక్క‌డ డ‌బ్బు చెల్లించాల‌న్నా యూపీఐ ద్వారా చెల్లించ‌డం అల‌వాటై పోయింది.

ఆధునిక టెక్నాల‌జీతో అందుబాటులోకి రావ‌డం, అప‌రిమిత ఇంట‌ర్నెట్ తో పాటు బ్యాంకింగ్ సేవ‌లు (banking services) విస్తృతం కావ‌డంతో లావాదేవీల‌కు ఇబ్బందుల్లేకుండా పోయింది. జేబులో డ‌బ్బులు లేక‌పోయినా చేతిలో ఫోన్, ఖాతాలో అమౌంట్‌ ఉంటే చెల్లింపులకు చెంత లేకుండా పోయింది. యూపీఐ లావాదేవీలు (UPI transactions) అందుబాటులోకి వ‌చ్చాక ఇది మ‌రింత సులువైంది. అయితే, వ‌చ్చే ఆగ‌స్టు 1 నుంచి యూపీఐ సేవ‌ల్లో చిన్న మార్పులు చోటు చేసుకోనున్నాయి. అవేమిటో తెలుసుకుందామా..

UPI Service | బ్యాలెన్స్ చెకింగ్‌పై ప‌రిమితి

యూపీఐ వినియోగదారులు త‌మ ఖాతాల్లో న‌గ‌దు నిల్వ‌ల‌ను చెక్ చేసుకోవ‌డంతో పాటు చెల్లింపులు చేయ‌డానికి ఇన్నాళ్లు ఎలాంటి ప‌రిమితి లేదు. అయితే, ఇక నుంచి బ్యాలెన్స్ చెక్ చేసుకోవ‌డంపై ప‌రిమితి విధించ‌నున్నారు. ఆగ‌స్టు 1 నుంచి కొత్త విధానం అమ‌లులోకి రానుంది. రోజుకు 50 సార్లు మాత్ర‌మే బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి అవ‌కాశం ఉంటుంది.

UPI Service | అలా చేస్తే అకౌంట్ బ్లాక్ అవుతుంది..

ఇక‌, యూపీఐ సేవ‌ల్లో (UPI services) మ‌రో కొత్త విధానాన్ని కూడా ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. చాలా మంది త‌మ నెల‌వారీ బిల్లుల‌ను చెల్లించేందుకు యూపీఐలో ఆటోపే పెట్టుకుంటారు. అయితే, పొర‌పాటున అకౌంట్‌లో డ‌బ్బులు లేక‌పోతే ఆయా ట్రాన్సాక్ష‌న్స్ ఫెయిల్ అవుతాయి. అయితే, ఇలా మూడుసార్లు జ‌రిగితే ఆటోమెటిక్‌గా యూపీఐ ఖాతా డీ యాక్టివేట్ అవుతుంది.

ఆగ‌స్టు 1 నుంచి యూపీఐ సేవ‌ల్లో ఈ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ నేప‌థ్యంలో వినియోగ‌దారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన అవ‌స‌రం ముంది.