HomeUncategorizedUPS | కేంద్రం కీలక నిర్ణయం.. యూపీఎస్​ ఖాతాదారులకు పన్ను ప్రయోజనాల్లో మార్పులు..!

UPS | కేంద్రం కీలక నిర్ణయం.. యూపీఎస్​ ఖాతాదారులకు పన్ను ప్రయోజనాల్లో మార్పులు..!

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: UPS : ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏకీకృత పెన్షన్ పథకాన్ని (యూపీఎస్​) Unified Pension Scheme (UPS) ప్రోత్సహించేందుకు తాజాగా కేంద్ర సర్కారు శ్రీకారం చుట్టింది. జాతీయ పెన్షన్ వ్యవస్థ (ఎన్​పీఎస్​) కింద ఉన్న వారితో సమానంగా ‘యూపీఎస్’ను ఎంచుకునే వారికి కూడా పన్ను ప్రయోజనాలు అందించాలని నిర్ణయించింది.

UPS : నిర్మలా సీతారామన్​ ఏమన్నారంటే..

‘కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనాలు కల్పించాలని నిర్ణయించాం.. వారి పదవీ విరమణ భద్రతను బలోపేతం చేయనున్నాం. ఈ మేరకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ మేరకు పన్ను చట్రంలోకి ఏకీకృత పెన్షన్ పథకం (యూపీఎస్) చేర్చాం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు పారదర్శకమైన, సౌకర్యవంతమైన, సమర్థవంతమైన పన్ను విధానాలను ఎంచుకోవచ్చు’ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Union Finance Minister Nirmala Sitharaman) అన్నారు.

UPS : మొదట వారికే..

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జనవరి 24, 2025న నోటిఫికేషన్ జారీ చేసింది. ఏమంటే.. సివిల్ సర్వీస్​లకు ఎంపికైన వారికి ఎన్​పీఎస్​ కింద ఒక ఆప్షన్​గా యూపీఎస్​ను ప్రవేశపెట్టింది. ఈ సదుపాయం ఏప్రిల్ 1, 2025 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. కానీ, ఎన్​పీఎస్​ కింద ఉన్న ఉద్యోగులు.. యూపీఎస్​లోకి మారాలంటే వన్​-టైమ్ ఆప్షన్ మాత్రమే ఉండడం గమనార్హం.

పెన్షన్ ఫండ్​ రెగ్యులేటరీ అండ్ డెవలప్​మెంట్ అథారిటీ (పీఎఫ్​ఆర్​డీఏ) Pension Fund Regulatory and Development Authority (PFRDA).. దీనిని అమలు చేయడానికి మార్చి 19, 2025న ఎన్​పీఎస్​ కింద యూపీఎస్​ నిర్వహణ నిబంధనలను నోటిఫై చేసింది. జనవరి 1, 2004న అమల్లోకి వచ్చిన ఎన్​పీఎస్​ కింద ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే యూపీఎస్ ఆప్షన్​​ వర్తిస్తుంది. ఈ నేపథ్యంలో దీనిని 23 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు వినియోగించుకునే అవకాశం ఉంది.

UPS : గతేడాది నిర్ణయం..

జనవరి, 2004 నుంచి పాత పెన్షన్ పథకం (ఓపీఎస్​) old pension scheme (OPS) నిలిపివేయబడింది. దీని​ కింద ఉన్న ఉద్యోగులు వారు చివరగా పొందే మూలవేతనంలో 50 శాతం పెన్షన్​గా అందుకునేవారు. కాగా, ఆగస్టు 24, 2024న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్​ సమావేశంలో యూపీఎస్​ పథకం ఆమోదం పొందింది.