అక్షరటుడే, వెబ్డెస్క్ : Inter Exams | ఇంటర్ వార్షిక పరీక్షల్లో (Intermediate annual examinations) స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ను గతంలోనే విడుదల చేశారు. అయితే అందులో ఓ పరీక్ష తేదిని తాజాగా అధికారులు మార్చారు.
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరగనున్నాయి. అయితే మార్చి 3న జరగాల్సిన సెకండియర్ పరీక్షను 4కు వాయిదా వేసింది. సెకండియర్ మ్యాథ్స్ 2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలను మార్చి 4న నిర్వహించనున్నట్లు బోర్డు (Inter Board) తెలిపింది. 3న హోలీ పండుగ ఉంది. దీంతో 4న పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. మిగతా పరీక్షలు యథావిధిగా జరుగుతాయి.
ఈ ఏడాది మొత్తం 9.50 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 2 నుంచి ప్రాక్టీకల్ పరీక్షలు (Practical Tests) నిర్వహించనున్నారు.