HomeUncategorizedRam Charan | పెద్ది కోసం రామ్ చ‌ర‌ణ్ మేకోవ‌ర్.. హాలీవుడ్ హీరోలా ఉన్నాడుగా..!

Ram Charan | పెద్ది కోసం రామ్ చ‌ర‌ణ్ మేకోవ‌ర్.. హాలీవుడ్ హీరోలా ఉన్నాడుగా..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Ram Charan | మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌డ‌మ్ అందిపుచ్చుకున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ చేసిన గేమ్ ఛేంజ‌ర్ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ 2025 జనవరి 10న విడుదల అయింది. ఈ సినిమా నిరాశ‌ప‌ర‌చ‌డంతో అంద‌రూ చెర్రీ తాజా ప్రాజెక్ట్ పెద్దిపై (Peddi Movie) హైఎక్స్‌పెక్టేష‌న్స్ పెట్టుకున్నారు. “ఉప్పెన” ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

Ram Charan | కేక పెట్టించే లుక్..

స్పోర్ట్స్ డ్రామాగా పెద్ది తెర‌కెక్కుతుంది. గ్లోబ‌ల్ బ్యూటీ జాన్వీ కపూర్ (Heroine Janhvi Kapoor) ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ మంచి బాణీలు సిద్ధం చేస్తున్నారు. అయితే సినిమాకు సంబంధించి రామ్ చ‌ర‌ణ్(Ram Charan) లుక్స్​పై అంద‌రిలో చాలా ఆస‌క్తి నెల‌కొంది. రామ్ చరణ్‌కు స్టార్ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్(Hair stylist Aalim Hakim) సరికొత్త లుక్ డిజైన్ చేశారని మైత్రి మూవీ మేకర్స్ఇప్ప‌టికే అధికారికంగా వెల్లడించారు. ‘‘ఇదివరకు చూడని లుక్‌లో చెర్రీ రాబోతున్నారు’’ అంటూ ఒక ఫోటోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఆలిమ్ హకీమ్ బాలీవుడ్‌లో టాప్ సెలబ్రిటీ స్టైలిస్ట్‌లలో ఒకరు. ఆయ‌న విరాట్ కోహ్లీ, ధోనీ, రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్, మహేష్ బాబు వంటి స్టార్స్​కు హెయిర్ స్టైలింగ్ చేశారు. ఇప్పుడు రామ్ చరణ్‌కు మరో పవర్‌ఫుల్ మేకోవర్ చేసిన‌ట్టు తెలుస్తుంది. పెద్ది సినిమా కోసం చ‌ర‌ణ్ చాలా హార్డ్ వ‌ర్క్ చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. తాజాగా రామ్ చ‌రణ్‌కి సంబంధించిన ఓ లుక్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఇది జిమ్ వ‌ర్క‌వుట్ టైం అని తెలుస్తుండగా, ఈ పిక్‌లో రామ్ చ‌ర‌ణ్‌ని చూస్తుంటే హాలీవుడ్ హీరోలే గుర్తుకు వ‌స్తున్నారు. ఆ ప‌ర్స‌నాలిటీ, స్టైల్ అచ్చు దింపేశాడు. చెర్రీ పిక్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంద‌ని చెప్పాలి.