అక్షరటుడే, వెబ్డెస్క్ : Panchayat Elections | రాష్ట్రంలో పంచాతీ ఎన్నికలు ముగిశాయి. మూడు దశల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ క్రమంలో కొత్త పాలకవర్గాల ప్రమాణ స్వీకార తేదీలో ప్రభుత్వం మార్పులు చేసింది.
రాష్ట్రంలో మూడో దశ పంచాయతీ ఎన్నికలు బుధవారం జరిగాయి. మధ్యాహ్నం నుంచి కౌంటింగ్ చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా సర్పంచులు లేక బోసిపోయిన పల్లెల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. దీంతో గ్రామాల్లో సందడిగా ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం (State Government) మూడు విడతల ఎన్నికల అనంతరం డిసెంబర్ 20న ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపట్టాలని మొదట ఆదేశించింది. తాజాగా ప్రమాణ స్వీకారాన్ని ఈ నెల 22న చేపట్టాలని పేర్కొంది.
Panchayat Elections | వినతులు రావడంతో..
రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరిగిన గ్రామాల్లో ప్రమాణ స్వీకారంతో పాటు, తొలి మీటింగ్ ఈ నెల 22న నిర్వహించనున్నారు. తొలుత ఈ నెల 20న నిర్వహించాలని ప్రభుత్వం పేర్కొంది. దీనిపై ప్రజాప్రతినిధుల నుంచి వినతులు రావడంతో పంచాయతీరాజ్ శాఖ (Panchayati Raj Department) నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నెల 19న అమావాస్య ప్రారంభం అయి 20 వరకు ఉండనుంది. అలాగే 20న శనివారం. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులు ప్రమాణ స్వీకార తేదిని మార్చాలని కోరినట్లు తెలుస్తోంది. చాలా మంది అమావాస్య రోజు కొత్త పనులు ప్రారంభించారు. అలాగే శనివారం సైతం పనులు చేపట్టేందుకు ఆలోచిస్తుంటారు. దీంతో ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన వినతుల మేరకు ప్రభుత్వం ప్రమాణ స్వీకార తేదిని మార్చినట్లు తెలుస్తోంది.