అక్షరటుడే, వెబ్‌డెస్క్: Tirupati-Shirdi train | తిరుపతి-షిర్డీ మధ్య నిత్యం ఎక్స్‌ప్రెస్ రైలు నడపాలని ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh ముఖ్యమంత్రి చంద్రబాబు Chief Minister Chandrababu ప్రతిపాదించారు.
చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్ర సర్కారు సానుకూలంగా స్పందించింది. సదరు ప్రతిపాదనను అంగీకరించింది. ఇప్పటి వరకు ప్రత్యేక రైలుగా నడుస్తున్న దీనిని సేవలను ఇకపై అందించనున్నట్లు వెల్లడించింది.
Tirupati-Shirdi train | ఈ మార్గంలో ప్రయాణం..
తిరుపతి Tirupati -షిర్డీ Shirdi (07637/07638 నంబరు) రైలును నిత్యం నడపనున్నట్లు కేంద్రం ప్రకటించింది. రేణిగుంట, ధర్మవరం, రాయచూర్, షోలాపూర్, దౌండ్ మీదుగా ఈ ఎక్స్‌ప్రెస్ రైలు రాకపోకలు సాగించనుంది.
భక్తుల రద్దీ దృష్ట్యా ఇటీవల తిరుపతికి రైళ్ల రాకపోకలు పెరిగాయి. కొత్త సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. గత నెలలో మరో సర్వీసు అందుబాటులోకి వచ్చింది.
తిరుపతి వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని పెద్దపల్లి జంక్షన్ మీదుగా మరొక ప్రత్యేక రైలు(Special Train) నడుపుతున్నారు.
నాందేడ్ నుంచి ధర్మవరం వరకు వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలు(Weekly Express Train)ను దక్షిణ మధ్య రైల్వే జోన్ నాందేడ్ డివిజన్ అధికారులు నడుపుతున్నారు.
ఈ ట్రైన్ నంబర్ నాందేడ్ నుంచి ధర్మవరం వెళ్లేటప్పుడు 07189, ధర్మవరం నుంచి నాందేడ్ వచ్చేటప్పుడు 07190గా ఉంటుంది.
ఇక తాజా తిరుపతి – షిర్డీ రైలును నిత్యం నడపడం వల్ల అనేక మంది ప్రయాణికులకు వెసులుబాటు కానుంది. ముఖ్యంగా రేణిగుంట, ధర్మవరం, రాయచూర్, షోలాపూర్, దౌండ్ ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా మారనుంది.