HomeUncategorizedAP CM Chandrababu Naidu | మ‌ళ్లీ టీడీపీ అధ్య‌క్షుడిగా చంద్ర‌బాబు.. 30 ఏళ్లుగా అదే...

AP CM Chandrababu Naidu | మ‌ళ్లీ టీడీపీ అధ్య‌క్షుడిగా చంద్ర‌బాబు.. 30 ఏళ్లుగా అదే పదవిలో..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : AP CM Chandrababu Naidu | టీడీపీ శ్రేణులు, నేత‌లు పెద్ద పండుగ‌గా భావించే మ‌హానాడు కార్య‌క్ర‌మం (Mahanaadu event) స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది. ఎటు చూసినా పసుపు జెండాలు, పచ్చని తోరణాలు. అడుగడుగునా పండగ వాతావరణం. ఎవర్ని కదిలించినా అంతటా ఉరకలెత్తే ఉత్సాహమే క‌నిపిస్తుంది.

కాగా.. ఈ రోజు మ‌హానాడులో విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు (world-famous actor), తెలుగు వారి ఆరాధ్య దైవం, సంక్షేమానికి కొత్త బాట చూపిన సంఘ సంస్కర్త, ‘అన్న’ నందమూరి తారక రామారావు NTR జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు. ఈ మూడు రోజల పండగలో మొదటిరోజు 5 అంశాలపై తీర్మానాలు జరిగాయి. ఇందులో పాలుపంచుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.

AP CM Chandrababu Naidu | 30 ఏళ్లుగా..

దశాబ్దాలుగా కీలకంగా వ్యవహరిస్తూ ఎన్ని అవాంత‌రాలు ఎదురైన కూడా పార్టీని ముందుకు న‌డిపిస్తున్న చంద్ర‌బాబు మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా (TDP national president) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ఎటువంటి ప్రతిస్పర్థ లేకుండా, ఆయన తిరిగి అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డారని టీడీపీ ఎన్నికల కమిటీ ఛైర్మన్ వర్ల రామయ్య (TDP election committee chairman Varla Ramaiah) ప్రకటించారు. ఈ ప్రకటనను మహానాడు వేదికపై అధికారికంగా వెల్లడించ‌డంతో పార్టీ నేతలు, మంత్రులు, కార్యకర్తలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తొలిసారి 1995లో పార్టీ నాయకత్వ బాధ్యతలు స్వీకరించారు.

అప్పటి నుండి సుమారు 30ఏళ్లుగా ఆయన ఈ పదవిని నిర్విరామంగా నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ప్రతి రెండేళ్లకోసారి జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయి. ఈ సారి కూడా ఆయనే అభ్యర్థిగా నిల‌వ‌గా, చంద్రబాబుని (Chandrababu Naidu) ఏకగ్రీవంగా ఎన్నుకోవ‌డం గమనార్హం.

చంద్ర‌బాబు మ‌రోసారి జాతీయ అధ్య‌క్షుడిగా ఎన్నికైన క్ర‌మంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీకి చెందిన ఇతర ప్రముఖ నాయకులు ఆయనకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌కు (Education and IT Minister Nara Lokesh) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించాలంటూ రోజు రోజుకి డిమాండ్ పెర‌గుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అలాంటి వేళ.. కడపలో జరుగుతోన్న మహానాడు వేదికగా నారా లోకేష్‌కు కీలక పదవి ఇవ్వాలని పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర ప్రతిపాదించారు

Must Read
Related News