Homeఆంధప్రదేశ్Chandrababu | తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ కానున్న చంద్రబాబు

Chandrababu | తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ కానున్న చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ కానున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chandrababu | తెలంగాణలో టీడీపీ (TDP) అభివృద్ధిపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మళ్లీ ఫోకస్​ పెట్టారు. కొంతకాలంలో రాష్ట్రంలో పార్టీ గురించి ఆయన పట్టించుకోలేదు.

ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు తెలంగాణ టీడీపీ నేతలతో మంగళవారం సాయంత్రం భేటీ కానున్నారు. జూబ్లీహిల్స్‌ (Jubilee Hills) ఉపఎన్నిక, స్థానిక ఎన్నికలపై ఆయన చర్చించనున్నారు. జూబ్లీహిల్స్​ స్థానానికి నవంబర్​ 11న ఎన్నిక జరగనుంది. ఇక్కడ టీడీపీకి క్యాడర్​ ఉంది. దీంతో ఈ ఎన్నికల్లో పోటీ చేయాలా.. లేదంటే ఇతరులకు మద్దతు ఇవ్వాల అనేదానిపై చర్చించనున్నారు.

Chandrababu | పూర్వ వైభవం కోసం..

తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకు రావాలని చంద్రబాబు కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. గతంలో తెలంగాణలో కీలకంగా ఉన్న పార్టీకి.. ఇప్పుడు కూడా రెండు మూడు జిల్లాల్లో పట్టు ఉంది. దీంతో అక్కడి నుంచి మళ్లీ విస్తరించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. 2014 ఎన్నికల్లో సైతం టీడీపీ తెలంగాణలో 15 స్థానాల్లో విజయం సాధించింది. అనంతరం పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు బీఆర్​ఎస్​లో చేరారు. ఓటుకు నోటు కేసు అనంతరం తెలంగాణలో టీడీపీ గురించి బాబు పట్టించుకోవడం మానేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పలువురు పని చేసినా ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు.

Chandrababu | అధ్యక్షుడిని నియమిస్తారా..

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా పని చేసిన కాసాని జ్ఞానేశ్వర్​ గత అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ మారారు. దీంతో ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షుడిగా నర్సింలు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై చంద్రబాబు చర్చించనున్నట్లు తెలిసింది. గతంతో టీడీపీలో కీలకంగా పని చేసిన నేతలు మళ్లీ తిరిగి రావడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వారిలో ఒకరు పార్టీ అధ్యక్ష పదవి ఆశిస్తున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పార్టీ అధ్యక్షుడి నియామకంతో పాటు స్థానిక ఎన్నిక (Local Body Elections)ల్లో పోటీపై చంద్రబాబు చర్చించనున్నారు.