అక్షరటుడే, వెబ్‌డెస్క్: Chandrababu Quantum Computing | అమరావతి కేంద్రంగా క్వాంటం కంప్యూటింగ్‌కు శంకుస్థాపన చేశామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) అన్నారు. అమరావతిలో మంత్రులు, కార్యదర్శుల సోమవారం ఆయన సమావేశం నిర్వహించారు.
ఏపీలో క్యాంటం కంప్యూటింగ్‌కు ఆదివారం చంద్రబాబు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా ఆయన మాట్టాడారు. త్వరలో ప్రపంచానికి మనమే కంప్యూటర్లు అందిస్తామన్నారు. ఏఐ, క్వాంటం కంప్యూటర్లు (Quantum Computers), డేటా సెంటర్లతో పెనుమార్పులు రానున్నట్లు చెప్పారు. ప్రతి నెల అధికారులు సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఇన్ఛార్జ్ మంత్రులు పని చేయాలన్నారు.
Chandrababu Quantum Computing | స్వర్ణాంధ్ర విజన్‌పై..
ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు క్షేత్రస్థాయిలో పని చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) సూచించారు. చిన్న సమస్యలను సైతం సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో స్వర్ణాంధ్ర-2047 విజన్, పది సూత్రాలపై ప్రధానంగా చర్చించారు. 2026-27 ఆర్థిక సంవత్సర లక్ష్యాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్‌గా ఈ సమావేశంలో పాల్గొన్నారు. క్యాంటం కంప్యూటింగ్‌తో అమరావతి (Amaravati) రూపు రేఖలు మారుతాయని బాబు అన్నారు.
Chandrababu Quantum Computing | హామీలు అమలు చేస్తున్నాం
తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. స్త్రీ శక్తి పథకంతో 4.29 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు జరిగాయన్నారు. అన్నదాత సుఖీభవ కింద రూ.6,310 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. రూ.58,654 కోట్ల పెన్షన్లు పంపిణీ చేశామని తెలిపారు. సూపర్ సిక్స్‌లో అన్ని హామీలను అమలు చేస్తున్నామన్నారు.