ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Stree Shakti Scheme | ‘స్త్రీ శక్తి’ పథకానికి శ్రీకారం.. మ‌హిళ‌ల‌తో క‌లిసి బ‌స్సులో ప్ర‌యాణించిన...

    Stree Shakti Scheme | ‘స్త్రీ శక్తి’ పథకానికి శ్రీకారం.. మ‌హిళ‌ల‌తో క‌లిసి బ‌స్సులో ప్ర‌యాణించిన చంద్ర‌బాబు, ప‌వ‌న్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stree Shakti Scheme | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘స్త్రీ శక్తి’ పథకాన్ని అధికారికంగా ఈరోజు ప్రారంభించింది. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) స్వయంగా బస్సులో ప్రయాణించి ప్రారంభించారు.ఈ మేరకు ముగ్గురు నేతలు ఉండవల్లి నుంచి తాడేపల్లి, కనకదుర్గ వారధి మీదుగా విజయవాడ బస్ టెర్మినల్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. మహిళా ప్రయాణికులతో కలిసి పయనిస్తూ వారితో ఆనందాన్ని పాలుపంచుకున్నారు.

    Stree Shakti Scheme | మ‌హిళ‌ల‌తో ప్ర‌యాణం..

    ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురందేశ్వరి మాధవ్, ఇతర కూటమి నేతలు కూడా పాల్గొన్నారు. బస్సు ప్రయాణ మార్గమంతా మహిళలు పెద్ద ఎత్తున గుమిగూడి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. థ్యాంక్యూ స‌ర్.. “జై స్త్రీ శక్తి” అంటూ నినాదాలతో హోరెత్తించారు.మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. పలు ప్రాంతాల్లో బాణసంచా కాల్చి కార్యకర్తలు ఆనందం పంచుకున్నారు. ఇక ‘స్త్రీ శక్తి’ పథక విశేషాల విష‌యానికి వ‌స్తే .. రాష్ట్రంలోని అర్హత కలిగిన మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో(RTC Bus) ఉచిత ప్రయాణ సౌకర్యం చేయ‌వ‌చ్చు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఐదు కోట్ల ప్రయాణాలు ఉచితంగా చేయ‌నున్నారు.

    ఈ పథకం ద్వారా మహిళలకు ఆర్థిక భారం తగ్గడం, ఉద్యోగ, విద్య, ఆరోగ్య పరంగా ప్రయాణం సులభతరం కావడం లాంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో ప్రకటించిన ముఖ్య హామీల్లో ఇదొకటి కాగా , ప్రభుత్వం (AP Government) అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే అమలు చేసి ప్రజలకు అనుసంధానమైన పాలన అందిస్తామన్న సంకల్పాన్ని ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, కుటుంబాలు చంద్రబాబు ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నారు. విజ్ఞప్తిగా చేసిన హామీని వాస్తవంగా మార్చిన చరిత్రలో మరో అడుగు వేసినట్టైంది ‘స్త్రీ శక్తి’ పథకం.

    Latest articles

    Tirumala | ఏఐ టెక్నాల‌జీతో వేగంగా శ్రీవారి దర్శనం.. టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | భక్తుల భాగస్వామ్యంతో స‌నాత‌న ధ‌ర్మ‌ ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తామ‌ని టీటీడీ ఛైర్మ‌న్...

    Jeevan Reddy | తెలంగాణకు మళ్లీ చీకటి రోజులు

    అక్షర టుడే, ఆర్మూర్‌ : Jeevan Reddy | కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణకు మళ్లీ చీకటి రోజులు వచ్చాయని...

    Mahammad nagar | పంద్రాగస్టు రోజు యథేచ్ఛగా మద్యం విక్రయాలు

    అక్షరటుడే, నిజాంసాగర్‌: Mahammad nagar | స్వాతంత్య్ర దినోత్సవం రోజు యథేచ్ఛగా మద్యం విక్రయాలు కొనసాగాయి. ఎక్సైజ్​శాఖ (Excise...

    GST | జీఎస్టీలో రెండే స్లాబులు.. త‌గ్గ‌నున్న ప‌న్నుల భారం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GST | వ‌స్తు సేవ‌ల ప‌న్ను (జీఎస్టీ)లో కీల‌క మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప‌న్ను...

    More like this