ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Chandrababu Naidu | రూ.500 నోట్లను ర‌ద్దు చేయాలి.. చంద్ర‌బాబు సంచ‌ల‌న కామెంట్స్

    Chandrababu Naidu | రూ.500 నోట్లను ర‌ద్దు చేయాలి.. చంద్ర‌బాబు సంచ‌ల‌న కామెంట్స్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Chandrababu Naidu | ప్ర‌తి ఏడాది ఎంతో అంగ‌రంగ వైభ‌వంగా జరిగే మ‌హానాడు కార్య‌క్రమం(Mahanadu program) ఈ ఏడాది కడప కడపలో అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది.

    తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు(NTR)కి పుష్పమాలతో ఘన నివాళులర్పించిన అనంతరం మహానాడు వేడుకలను ప్రారంభించారు. పార్టీ జెండాను ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు Chandrababu naidu ఆవిష్కరించారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ అభివృద్ధి కోసం తాను సైనికుడిలా పోరాటం చేస్తానని.. పసుపు సైనికులు తోడుగా ఆకాశమే హద్దుగా ఏపీ భవిష్యత్‌ను మారుస్తానని చెప్పారు.

    Chandrababu Naidu | అవి ర‌ద్దు చేయాలి..

    దేశంలో అవినీతిని పూర్తిగా తరిమేయాలంటే పెద్దనోట్లను రద్దు చేయాలన్నారు. ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ.500 రూపాయల నోట్లను(500 rupee notes) కూడా రద్దు చేసి పూర్తిగా ఆర్ధిక లావాదేవీలను డిజిటల్‌లో మార్చితే అవినీతిని పూర్తిగా రూపుమాపవచ్చన్నారు. దేవుని కడపలో జరుగుతున్న 43వ టీడీపీ మహానాడు వేదికపై ప్రసంగించిన చంద్రబాబు రాష్ట్రంలో వెల్దీ, హెల్దీ వాతావరణం సృష్టించడంతో పాటు అభివృద్ది చేసి పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే టీడీపీ పార్టీ(TDP Party) లక్ష్యమని..ఎన్డీఏ కూటమి ప్రభుత్వ బాధ్యత అని ప్రకటించారు. గడిచిన 43ఏళ్ల టీడీపీ పార్టీ ఎన్నో ఒడిదుడుకులు, కుట్ర రాజకీయాలను ఎదుర్కొందని చంద్రబాబు అన్నారు. వైసీపీ YCP హయాంలో హింసాత్మక రాజకీయాలను తట్టుకొని టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు పార్టీకి సైనికుల్లా పని చేశారని చెప్పారు.

    2047లోగా రాష్ట్రాన్ని పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు మహానాడు వేదికపై మాటిచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవినీతికి వ్యతిరేకంగా.. అధికారంలోకి వచ్చాక అవినీతి రహిత పాలన చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలలో Telugu states ఏపార్టీలో చూసినా తెలుగు దేశం యూనివర్సిటీ(Telugu Desam University) నుంచి వెళ్లిన నాయకులే ఉంటారని.. టీడీపీ నాయకులను తయారు చేసే పార్టీ అన్నారు చంద్రబాబు.

    “ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే బాధ్యత నాది. సూపర్ సిక్స్ పథకాలను పూర్తిగా అమలు చేసి ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంచుతాం” అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై కూడా ఆయన పలు విషయాలను ప్రస్తావించారు. కార్యకర్తల కృషి, ప్రజల మద్దతుతోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతామని చంద్రబాబు తెలిపారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...