అక్షరటుడే, వెబ్‌డెస్క్: CM Chandrababu | ఆంధ్రప్రదేశ్ , విశాఖపట్నంలో (Vishakapatnam) జరుగుతున్న 30వ సీఐఐ-భాగస్వామ్య సదస్సు ద్వారా ఇప్పటి వరకు రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chief Minister Chandrababu Naidu) తెలిపారు.
విశాఖలో రెండు రోజుల సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII-Partnership Summit) నేటితో ముగియనుంది. వివిధ దేశాల నుంచి 30కి పైగా మంత్రులు ఈ భాగస్వామ్య సదస్సుకు హాజరయ్యారని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రెండు రోజుల వ్యవధిలోనే.. ఎంవోయూలు, భాగస్వామ్యాలు, పెట్టుబడులు, ఇలా 67 సెషన్లను నిర్వహించామని సీఎం వివరించారు. దావోస్ తరహాలోనే ఈ సీఐఐ సదరస్సు నిర్వహించామి చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సదస్సుకు.. మొత్తం 60 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు. 700కు పైగా బీటూబీ సమావేశాలు జరిగాయన్నారు.
CM Chandrababu | భారీ పెట్టుబడులు..
విశాఖపట్నంలో జరిగిన పారిశ్రామిక సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhrapradesh Government) భారీ పెట్టుబడులను ఆకర్షించింది. ఈ సదస్సులో గురువారం ఒక్కరోజే.. సుమారు 35 సంస్థలు రూ.3,65,304 కోట్ల విలువైన పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. ఇవన్ని అమలైతే.. రాష్ట్రంలో 16,31,188 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగిన ఈ సదస్సులో, ఎంవోయూలు కుదుర్చుకున్న వెంటనే.. ప్రభుత్వం.. ఆయా సంస్థలకు ప్రోత్సాహకాలిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం విశేషం. ఇక గడిచిన 18 నెలల్లో రాష్ట్రానికి రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. శ్రీసిటీలో మరిన్ని యూనిట్లను వర్చువల్‌గా ప్రారంభించారు. ఇక్కడ మరో 12 ప్రాజెక్టుల ఏర్పాటు చేసేందుకు గాను.. పలు కంపెనీలతో Companies ఒప్పందాలు చేసుకున్నారు. ఈ పెట్టుబడుల ద్వారా 12,365 మందికి ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. చక్కని ప్రణాళికతో శ్రీసిటీని (Sri City) ఏర్పాటు చేశామని, ఇది అభివృద్ధికి నిదర్శనంగా నిలిచిందన్నారు.
డైకిన్, ఇసుజూ, క్యాడ్బరీ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు శ్రీసిటీ నుంచే తమ ఉత్పత్తులను అందిస్తున్నాయని చంద్రబాబు నాయుడు తెలిపారు. త్వరలోనే శ్రీసిటీకి మరో 6 వేల ఎకరాల భూమిని కేటాయిస్తామని.. 50 దేశాలకు చెందిన కంపెనీలు ఇక్కడి నుంచే పనిచేస్తాయని తెలిపారు. ఈక్రమంలో మొత్తం 1.5 లక్షల ఉద్యోగాలతో శ్రీసిటి అభివృద్ధి మోడల్‌గా మారుతుందన్నారు. 2028 నాటికి దీనిని ఉత్తమ పారిశ్రామిక ప్రాజెక్టుగా మారుస్తామని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తరలి వచ్చాయని అంటున్నారు.
1 comment
[…] ఆరోపణలతో చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), వేమూరి హరికృష్ణ ప్రసాద్, కోగంటి […]
Comments are closed.