HomeUncategorized Chandra Babu Naidu | చంద్రబాబు నాయుడు సీఎంగా 30 ఏళ్లు పూర్తి… ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో...

 Chandra Babu Naidu | చంద్రబాబు నాయుడు సీఎంగా 30 ఏళ్లు పూర్తి… ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మ‌రో మైలురాయి!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chandra Babu Naidu | ఆధునిక ఆంధ్రప్రదేశ్‌ రూపకర్తగా పేరుగాంచిన నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రయాణంలో మరో కీలక ఘట్టాన్ని చేరుకున్నారు. 1995లో తొలిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన నేటితో 30 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.

ఇది తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలోనే అరుదైన ఘట్టంగా నిలిచింది. చంద్రబాబు సీఎంగా 30 ఏళ్ల ప్రయాణం చూస్తే..1995 సెప్టెంబర్ 1న తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఆ త‌ర్వాత తొలిసారి, రెండోసారి కలిపి 2004 మే 29 వరకు.. అంటే ఎనిమిదేళ్ల 8 నెలల 13 రోజులు ముఖ్యమంత్రిగా చంద్రబాబు(Chandra Babu Naidu) వ్యవహరించారు.

 Chandra Babu Naidu | మరో మైలురాయి..

మూడోసారి 2014 జూన్ 8 నుంచి 2019 మే 29 వరకు చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్నారు. ఇక నాలుగోసారి 2024 జూన్ 12 నుంచి చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా కొనసాగుతున్నారు. అంటే ఈ రోజు వ‌ర‌కు మొత్తం 14 ఏళ్ల 11 నెలలు ముఖ్య‌మంత్రిగా ఉన్నారు. రోజుల ప్ర‌కారం చూస్తే ఆయ‌న‌ 5,442 రోజులు సీఎంగా ఉన్నారు. ఆయన పాలనలో జరిగిన ముఖ్యమైన మార్పులు చూస్తే.. ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్ సిటీ, సైబరాబాద్, ఔటర్ రింగ్ రోడ్, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వంటి ప్రాజెక్టులతో పాటు హైదరాబాద్‌(Hyderabad)ని టెక్ హబ్‌గా గుర్తింపు ద‌క్కేలా చేశారు.

విభజన అనంతరం అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్‌పై ప్ర‌త్యేక ఫోక‌స్ పెట్టారు. 2024లో అధికారంలోకి వచ్చాక అమరావతి, విశాఖ, రాయలసీమకు ప్రత్యేక దృష్టి పెట్టారు. అమరావతి(Amaravati)లో ‘క్వాంటం వ్యాలీ’, విశాఖను ఐటీ, ఆర్థిక రాజధానిగా మార్చారు. రాయలసీమను పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు ర‌చిస్తున్నారు. చంద్రబాబు సీఎంగా 30 ఏళ్లు పూర్తి చేసిన సందర్భంగా పిడుగురాళ్లలో భారీ సభ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వేలాది మంది మహిళలు పాల్గొన్న ఈ సభలో చంద్రబాబు రాజకీయ జీవితంలోని ముఖ్య ఘట్టాలు ప్రస్తావించబడ్డాయి. అలాగే రాజంపేటలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు, ప్రజలతో మమేకమయ్యారు. కాగా, చంద్రబాబు నాయుడు దేశ రాజకీయాల్లో కూడా ‘కింగ్ మేకర్’ అని చెప్పాలి.