Homeఆంధప్రదేశ్Polavaram Project | పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయ‌డానికి టైం ఫిక్స్ చేసిన చంద్ర బాబు.....

Polavaram Project | పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయ‌డానికి టైం ఫిక్స్ చేసిన చంద్ర బాబు.. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Polavaram Project | ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

2027లో జరిగే గోదావరి పుష్కరాలకు ముందు ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యంతో శుక్రవారం సచివాలయంలో జలవనరుల శాఖ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు(CM Chandrababu) మాట్లాడుతూ.. ప్రాజెక్టు పనుల నాణ్యతపై ఎట్టి పరిస్థితుల్లో రాజీపడరాదని హెచ్చరించారు. పనుల ప్రగతిపై అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు డయాఫ్రం వాల్ పనులు గణనీయంగా పూర్తి అయినట్లు, బట్రెస్ డ్యామ్ పనులు పూర్తయినట్లు తెలిపారు.

Polavaram Project | 2027 డిసెంబరు టార్గెట్

ప్రధాన డ్యామ్‌కు సంబంధించిన ఎర్త్-కం-రాక్‌ఫిల్ పనులను 2024 నవంబరులో ప్రారంభించి, 2027 డిసెంబరులో పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు.పోలవరం కుడికాలువ టన్నెల్, హెడ్ రెగ్యులేటర్, అప్రోచ్ ఛానల్ పనులు కూడా సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.2026 జనవరి నాటికి ఎడమ ప్రధాన కాలువ పనులు పూర్తయ్యి, అనకాపల్లి వరకు నీరందేలా చర్యలు తీసుకోవాలి అని చెప్పారు.ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అనుమతులు త్వరితగతిన పొందేందుకు కేంద్ర జల సంఘం (CWC), జలవనరుల మంత్రిత్వ శాఖతో సమన్వయం పెంచాలని అధికారులకు సూచించారు.

పోలవరం ప్రాజెక్టు(Polavaram Project)ను కేవలం సాగునీటి ప్రాజెక్టుగా కాకుండా, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ రహదారితో అనుసంధానించేలా ఒక ఐకానిక్ రోడ్ నిర్మించాలని సూచించారు.రాజమహేంద్రవరాన్ని కేంద్రంగా చేసుకుని ‘అఖండ గోదావరి’ ప్రాజెక్టును ప్రారంభించాలని సూచించారు. పనుల పురోగతిని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) ద్వారా పర్యవేక్షించేందుకు, ప్రాజెక్టు ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశించారు.ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu), ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇది కేవలం ప్రాజెక్టు మాత్రమే కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాటం అని చంద్రబాబు స్పష్టం చేశారు.