HomeUncategorizedCM Chandrababu Naidu | 35 ఏళ్ల‌కి నెర‌వేరిన చంద్ర‌బాబు క‌ల‌.. కుప్పంలో సీఎం చంద్రబాబు...

CM Chandrababu Naidu | 35 ఏళ్ల‌కి నెర‌వేరిన చంద్ర‌బాబు క‌ల‌.. కుప్పంలో సీఎం చంద్రబాబు గృహప్రవేశం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :CM Chandrababu Naidu | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 35 ఏళ్ల క‌ల‌ని నెర‌వేర్చుకున్నారు.

తన సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా(Chittoor District) కుప్పంలో నూతన గృహప్రవేశం చేశారు. గత కొద్దిరోజులు జరుగుతున్న నిర్మాణ పనులు పూర్తి కావడంతో ఆదివారం స్వగృహంలోకి అడుపెట్టారు సీఎం దంపతులు. చిత్తూరు జిల్లా కుప్పం (Kuppam)లో కుటుంబ సభ్యులతో కలిసి సీఎం చంద్రబాబు (CM Chandrababu) గృహప్రవేశం చేశారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు సంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు ముగించుకున్న అనంతరం ఉదయం 10 గంటలకు టీడీపీ కుటుంబ సభ్యులు, ప్రజలను చంద్రబాబు దంపతులు కలవనున్నారు.

CM Chandrababu Naidu | సొంతింటి క‌ల‌..

గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలపనున్న వారి కోసం ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. ఈ శుభ కార్యక్రమానికి వచ్చే వారందరికీ పసందైన పలు రకాల విందు వంటకాలూ వండి పెట్టారు. చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే(MLA)గా అనేక పర్యాయాలు పోటీ చేసి గెలుస్తూ వస్తున్న నియోజకవర్గం కుప్పం. ఇక్కడ సొంత ఇల్లు నిర్మించుకోవాలనేది పార్టీ శ్రేణులు, చంద్రబాబు కుటుంబ సభ్యుల కల. అది ఇన్నాళ్లకు నెరవేరింది. కుప్పం(Kuppam)లోని కొత్త ఇంటి గృహప్రవేశం నేపథ్యంలో సీఎం చంద్రబాబుతో (Chandra babu naidu) పాటు ఆయన కుటుంబ సభ్యులందరూ శనివారం రాత్రికే కుప్పం చేరుకున్నారు. చంద్రబాబు తరఫున ఆహ్వానాలు అందుకున్న నియోజకవర్గ ప్రజలు, టీడీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

నియోజకవర్గ ప్రజలకు చంద్రబాబు ముఖ్యమంత్రి(Chandrababu Chief Minister) మాత్రమే కాదు.. ఎమ్మెల్యే MLAకూడా. అంతమాత్రమేనా.. నిరంతరం వారి క్షేమ సమాచారాలు కనుక్కుంటూ బాగోగులు చూసే సొంత కుటుంబ సభ్యుడు. అందుకే కుప్పంలో ఈ హడావుడి. చాలా సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్షనేతగా బీజీగా ఉండటంతో ఆయన శాశ్వత నివాసం హైదరాబాద్‌(Hyderabad)లో ఏర్పాటు చేసుకున్నారు. అయితే నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలనే.. ఇప్పుడు కుప్పంలో కూడా నూతన నివాసాన్ని కట్టించుకున్నారు. మంచి ముహుర్తంలో ఇంట్లో పాలు పొంగించి గృహప్రవేశం చేశారు.