అక్షరటుడే, వెబ్‌డెస్క్ : AP Government| ఆటో డ్రైవర్ల సేవ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రి నారా లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh) లో ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ప్రతీ ఏటా రూ.15,000 మద్దతు ఇచ్చే పథకాన్ని ఏపీ కూటమి ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. ఈ పథకానికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), మంత్రి నారా లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి మాధవ్ పాల్గొన్నారు. విజయవాడ బసవపున్నయ్య స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది. తొలి విడతగా 2.90 లక్షల మందికి డబ్బు జమ కాగా, ఈ పథకం కింద మొత్తం 2,90,669 మంది డ్రైవర్ల ఖాతాల్లో రూ.436 కోట్లు జమ చేశారు.
వీరిలో ఆటో డ్రైవర్లు – 2.64 లక్షల మంది, ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు – 20,072, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు – 6,400 మంది ఉన్నారు. ఈ పథకం ప్రారంభానికి ముందు సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ , మాధవ్‌లు ఒక ఆటోలో ఉండవల్లి నుంచి సింగ్‌నగర్ వరకు ప్రయాణించి, ఆ తరువాత సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అంతేకాదు, ఖాకీ చొక్కాలు ధరించి డ్రైవర్లతో మమేకమయ్యారు.
AP Government| ఎక్కువ లబ్ధిదారులున్న జిల్లాలు:
ఈ పథకానికి మొత్తం 3.22 లక్షల దరఖాస్తులు వచ్చాయి. పరిశీలన అనంతరం 2.90 లక్షల మందిని అర్హులుగా ఎంపిక చేశారు.
అత్యధిక లబ్ధిదారులు ఉన్న జిల్లాలు:
- విశాఖపట్నం – 22,955 మంది
- నెల్లూరు – 17,405
- ఎన్టీఆర్ జిల్లా – 16,405
- విజయనగరం – 15,479
- శ్రీకాకుళం – 13,887
అతితక్కువగా: అల్లూరి సీతారామరాజు జిల్లాలో 4,217 మంది మాత్రమే.
కులాలవారీగా లబ్ధిదారుల సంఖ్య:
- బీసీలు – 1,61,737
- ఎస్సీలు – 70,941
- ఎస్టీలు – 13,478
- కాపులు – 25,801
- రెడ్డులు – 7,013
- ఈబీసీలు – 4,186
- మైనార్టీలు – 3,867
- కమ్మ – 2,647
- క్షత్రియ – 513
- బ్రాహ్మణులు – 365
- ఆర్యవైశ్యులు – 121
మీకు రూ.15,000 రాలేదా? ఇలా చెక్ చేసుకోండి:
- NBM అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి
- Application Status క్లిక్ చేయండి
- స్కీం పేరుగా “Auto Driver Sevalo” సెలెక్ట్ చేయండి
- సంవత్సరం: 2025-2026 ఎంచుకోండి
- ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్, మొబైల్‌కు వచ్చిన OTP నమోదు చేసి సబ్మిట్ చేయండి
- స్టేటస్‌లో పేరు ఉంటే కానీ డబ్బులు రాకపోతే – గ్రామ/వార్డు సచివాలయంలో అడగండి
- స్టేటస్‌లో పేరు లేకపోతే – మళ్లీ దరఖాస్తు చేయండి
సీఎం చంద్రబాబు (CM Chandra Babu)మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా ఆటో డ్రైవర్ల జీవితాల్లో స్థిరత్వం రావాలి. డ్రైవింగ్ చేసే వారికి ప్రభుత్వం తోడు నిలవాలి,” అని చంద్రబాబు అన్నారు. “పేదల కష్టాలకోసం పని చేయడమే మా కర్తవ్యం,” అని చెప్పారు. ఇదే క్రమంలో సేవలో పథకంలో ఇంకెవరికైనా సందేహాలుంటే, సచివాలయం లేదా అధికార వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. మీరు అర్హులైతే.. ఈ అవకాశం మిస్ అవకండి.