అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Chandra Babu | తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ఇప్పుడు పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. పార్టీ సంస్థాగత నిర్మాణాన్నిక్షేత్ర స్థాయి నుండి బలోపేతం చేసే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా కీలక చర్యలు ప్రారంభించింది.
ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (CM Chandra Babu) ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ (Palla Srinivas) తాజాగా కీలక నియామకాలు చేశారు. రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల పరంగా పార్టీ కమిటీల ఏర్పాటును పర్యవేక్షించేందుకు పరిశీలకులను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ముగ్గురు సీనియర్ నేతలతో కూడిన బృందాన్ని పరిశీలకులుగా నియమించారు.
CM Chandra Babu | ప్రత్యేక ఫోకస్..
ఈ బృందాలు నియోజకవర్గాలవారీగా సర్వసభ్య సమావేశాలు నిర్వహించి, పార్టీ నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు తీసుకుని, కమిటీల ఏర్పాటును సమన్వయపరిచే బాధ్యతను వహిస్తాయి. అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, ఆనం రామనారాయణ రెడ్డి వంటి సీనియర్ నాయకులు ఈ ప్రక్రియకు నాయకత్వం వహిస్తున్నారు. మూడు దశలుగా సమావేశాలు జరగనుండగా, ఆగస్టు 24న అనకాపల్లి, నర్సాపురం, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, ఒంగోలు నియోజక వర్గాల్లో సమావేశాలు జరుగుతాయి. ఆగస్టు 25న అరకు, కాకినాడ, అమలాపురం, బాపట్ల, రాజంపేట, చిత్తూరు, కడప, హిందూపురం నియోజక వర్గాలలో, ఆగస్టు 26న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, నెల్లూరు, తిరుపతి, నంద్యాల, కర్నూలు, అనంతపురం నియోజక వర్గాలలో సమావేశం జరగనుంది.
పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పరిశీలకుల జాబితా చూస్తే..
1. అరకు (ST) – బందెలం అశోక్, కొండపల్లి శ్రీనివాస్, బడేటి రాధాకృష్ణ
2. శ్రీకాకుళం – వంగలపూడి అనిత, కర్రొతు బంగార్రాజు, నజీర్ అహ్మద్
3. విజయనగరం – మహ్మద్ అహ్మద్ షరీఫ్, పీజీవీఆర్ నాయుడు (గన్నా బాబు), వాసంసెట్టి సుభాష్
4. విశాఖపట్నం – నిమ్మల రామానాయుడు, కుడిపూడి సత్తిబాబు, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి
5. అనకాపల్లి – ఏలూరి సాంబశివరావు, డేగల ప్రభాకర్, పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి
6. కాకినాడ – కింజరాపు అచ్చెన్నాయుడు, ప్రణవ్ గోపాల్, అరిమిల్లి రాధాకృష్ణ
7. అమలాపురం – కొల్లు రవీంద్ర, జి.వి. ఆంజనేయులు, గొట్టిముక్కల రఘురామరాజు
8. రాజమండ్రి – పత్తిపాటి పుల్లారావు, కొలుసు పార్ధసారధి, ముక్కు ఉగ్రనరసింహారెడ్డి
9. నర్సాపురం – పొంగూరు నారాయణ, నూకసాని బాలాజీ, అనిమిని రవినాయుడు
10. ఏలూరు – గొట్టిపాటి రవి, ఎం.ఎస్.రాజు, బుద్దా నాగ జగదీష్
11. మచిలీపట్నం – కాల్వ శ్రీనివాసులు, పీలా గోవింద సత్యనారాయణ, దామచర్ల సత్యనారాయణ
12. విజయవాడ – పయ్యావుల కేశవ్, బి.టి. నాయుడు, పొలం రెడ్డి దినేష్ రెడ్డి
13. గుంటూరు – ఎన్ఎమ్‌డీ ఫరూక్, కిమిడి నాగార్జున, మద్దిపాటి వెంకట్రాజు
14. నరసరావుపేట – జ్యోతుల నెహ్రూ, మందలపు రవి, కొనకళ్ళ నారాయణ
15. బాపట్ల – పంచుమర్తి అనురాధ, మన్నే సుబ్బారెడ్డి, వీరంకి వెంకటగురుమూర్తి
16. ఒంగోలు – గుమ్మిడి సంధ్యారాణి, కనపర్తి శ్రీనివాస్, సోమిశెట్టి వెంకటేశ్వర్లు
17. నెల్లూరు – ఆనగాని సత్య ప్రసాద్, డూండి రాకేష్, పులివర్తి వెంకట మణిప్రసాద్
18. తిరుపతి – మంతెన రామరాజు, ఎస్. సవిత, బుచ్చి రామ్ ప్రసాద్
19. రాజంపేట – ఆనంరామనారాయణరెడ్డి, గన్ని వీరాంజనేయులు, వై. నాగేశ్వరరావు యాదవ్
20. చిత్తూరు – బి.సి. జనార్ధనరెడ్డి, ఆలపాటి రాజేంద్రప్రసాద్, పిల్లి మణిక్యాలరావు
21. నంద్యాల – సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పూల నాగరాజు, కోవెలమూడి నాని
22. కర్నూలు – నక్కా ఆనందబాబు, బి.కె. పార్ధసారథి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
23. కడప – బీదా రవిచంద్ర, బి.వి. జయనాగేశ్వరరెడ్డి, నాదెండ్ల బ్రహ్మంచౌదరి
24. అనంతపురం – ఎన్. అమర్నాథ్ రెడ్డి, డా. డోలా బాల వీరాంజనేయస్వామి, మద్దిపట్ల సూర్యప్రకాశ్
25. హిందూపురం – దేవినేని ఉమామహేశ్వరరావు, టి.జి. భారత్, మారెడ్డి శ్రీనివాసరెడ్డి
ఈ చర్యల ద్వారా పార్టీ క్రమశిక్షణను పెంపొందించి, కార్యచరణను సమర్థవంతంగా అమలు చేయాలన్నది టీడీపీ ఆలోచన. 2029 ఎన్నికల దృష్ట్యా పార్టీని బలంగా నిలబెట్టే దిశగా ఇది తొలి మెట్టు అని అంటున్నారు.
1 comment
[…] చంద్రబాబు (CM Chandra Babu)మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా ఆటో […]
Comments are closed.