అక్షరటుడే, వెబ్‌డెస్క్: YS Jagan | ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు (CM Chandrababu)పై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు.రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై గురువారం జగన్ మీడియాతో మాట్లాడారు.
ప్రాజెక్ట్‌పై వాస్తవాలు అందరికీ తెలియాలన్నారు. రాయలసీమ లిఫ్ట్‌ను ఆపించామని తెలంగాణ సీఎం అసెంబ్లీలో ప్రకటించారని చెప్పారు. రాష్ట్రాన్ని చంద్రబాబు ఎలా అమ్మకానికి పెట్టారో రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చెప్పారన్నారు. స్వార్థ రాజకీయల కోసం రాష్ట్ర ప్రజలను చంద్రబాబు తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఇలాంటి చరిత్ర హీనులు దేశంలో ఎవరూ ఉండరన్నారు.
YS Jagan | 101 టీఎంసీల కేటాయింపులు
ఏపీకి పోతిరెడ్డిపాడు నుంచి 101 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయని జగన్ తెలిపారు. కానీ 20 ఏళ్లలో రెండు, మూడు సార్లే ఆ నీటిని తీసుకున్నట్లు చెప్పారు. 800 అడుగులలోపే 2 టీఎంసీల నీళ్లు తీసుకునేందుకు తెలంగాణ (Telangana)లో పాలమూరు- రంగారెడ్డి మొదలు పెట్టారన్నారు. రాష్ట్రానికి, రాయలసీమ ప్రయోజనానికి విఘాతం కలిగించేలా చంద్రబాబు నిర్ణయాలు ఉన్నాయని ఆరోపించారు.
YS Jagan | రహస్య ఒప్పందం
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ (Rayalaseema Lift Irrigation) అవసరం లేదని మాట్లాడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి అన్నారు. రేవంత్ రెడ్డితో వీళ్లకు రహస్య ఒప్పందం ఉందన్నారు. ఈ ప్రాజెక్ట్ రాయలసీమ, నెల్లూరుకు సంజీవని వంటిందన్నారు. అలాంటి ప్రాజెక్ట్‌ను చంద్రబాబు ఆపారని విమర్శలు చేశారు. చంద్రబాబు మౌనంగా ఉండటం వల్ల శ్రీశైలం ఎగువ భాగంలో తెలంగాణ ప్రాజెక్టులు చేపట్టిందన్నారు. ఎస్ఎల్బీసీ ద్వారా 45 టీఎంసీలు తరలించే పనులు చేస్తున్నారని చెప్పారు.