Homeఆంధప్రదేశ్Chandrababu and Revanth meets | చాలా రోజుల త‌ర్వాత‌ చంద్రబాబు-రేవంత్ ఆత్మీయ కలయిక.. వైరల్...

Chandrababu and Revanth meets | చాలా రోజుల త‌ర్వాత‌ చంద్రబాబు-రేవంత్ ఆత్మీయ కలయిక.. వైరల్ అవుతున్న వీడియో

Chandrababu and Revanth meets | రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ వేదికపై చంద్రబాబు–రేవంత్‌ల స్నేహపూర్వక కలయికను నెటిజన్లు సానుకూల సంకేతంగా విశ్లేషిస్తున్నారు. రాష్ట్రాల అభివృద్ధి, పరస్పర సహకారం దిశగా ఈ సమీక్ష కొనసాగాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Chandrababu and Revanth meets | హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో Ramoji Film City ఆదివారం నిర్వహించిన ‘రామోజీ ఎక్స్‌లెన్స్’ Ramoji Excellence జాతీయ అవార్డుల ప్రదానోత్సవం National Awards ceremony ఒక అరుదైన రాజకీయ దృశ్యానికి వేదికైంది.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు Chief Ministers .. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి Telangana CM Revanth Reddy, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు AP CM Nara Chandrababu Naidu చాలా రోజుల త‌ర్వాత‌ ఒకే వేదికపై కలుసుకుని ఆత్మీయంగా పలకరించుకున్నారు.

ఇద్దరూ నవ్వులు పూయిస్తూ మాట్లాడుకున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకుడు రామోజీ రావు పేరిట ఏర్పాటు చేసిన ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు హాజరయ్యారు

Chandrababu and Revanth meets | సానుకూల సంకేతం…

ముఖ్యంగా ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ Vice President CP Radhakrishnan, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ Telangana Governor Jishnu Dev Verma, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి Revanth Reddy, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు Union Ministers కిషన్ రెడ్డి Kishan Reddy , రామ్మోహన్ నాయుడు Rammohan Naidu, మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడుతోపాటు మరెందరో ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

ముందుగా వేదికకు చేరుకున్న చంద్రబాబును, కొద్దిసేపటికి వచ్చిన రేవంత్ రెడ్డి ఆప్యాయంగా పలకరించారు. ఇద్దరూ చేయి కలిపి హృదయపూర్వకంగా నవ్వుకున్నారు.

అనంతరం ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. వీరి ఆత్మీయ సంభాషణను చూసిన అంద‌రు ఆశ్చర్యపోయారు. ఆ వీడియోలను నెటిజన్లు విస్తృతంగా షేర్ చేస్తూ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు రేవంత్ రెడ్డి టీడీపీ ప్రధాన నాయకుడిగా, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేశారు. తర్వాత కాంగ్రెస్‌లో చేరినా, ఆయనపై ఎప్పుడూ వ్యక్తిగత విమర్శలు చేయలేదు. 2018లో కాంగ్రెస్–టీడీపీ TDP కూటమి ఏర్పడటంలో రేవంత్ కీలక పాత్ర పోషించారు.

అయితే ఆ కూటమి విజయవంతం కాలేకపోయింది. ప్రస్తుతం ఇద్దరూ రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి ఇటీవల జరిగిన సమావేశాల్లో కూడా వీరిద్దరూ కలిసి చర్చలు జరిపిన విషయం తెలిసిందే.

Must Read
Related News