ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Mahaa News | మ‌హా న్యూస్ ఛానెల్‌పై దాడి.. ఖండించిన చంద్ర‌బాబు, ప‌వ‌న్ , లోకేష్‌,...

    Mahaa News | మ‌హా న్యూస్ ఛానెల్‌పై దాడి.. ఖండించిన చంద్ర‌బాబు, ప‌వ‌న్ , లోకేష్‌, బండి సంజ‌య్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Mahaa News | హైదరాబాద్ నగరంలోని మహా న్యూస్ ఛానెల్ (Maha News) ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని ప‌లువురు నేతలు ఖండిస్తున్నారు. పత్రికా స్వేచ్ఛను అణచివేయాలనే కుట్ర అని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) మండిపడ్డారు. మీడియా కార్యాలయంపై దాడికి పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పత్రికా స్వేచ్ఛను హరించాలన్న లక్ష్యంతోనే బీఆర్ఎస్ కార్యకర్తలు (BRS activists) ఈ దాడికి దిగారని ఆరోపించారు. ఒకప్పుడు జర్నలిజం గురించి చాలా గొప్ప గొప్ప మాటలు చెప్పిన వారు, ఇప్పుడు మీడియా కార్యాలయాలపై (media offices) దాడులు చేయడం వారి వైఖరి ఎలాంటిదో తెలియజేస్తుందని విమర్శించారు.

    ‘మీరు అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా (Social Media) వేదికగా మా కార్యకర్తలపై అసత్య ప్రచారాలు, దూషణలు చేశారు. అప్పుడు మేమేమైనా మీ ఇళ్ల మీద దాడులు చేశామా?’ అని బండి ప్రశ్నించారు. మరణించిన యాంకర్ ఘటనలో బీఆర్ఎస్ నాయకులపై (BRS Leaders) వచ్చిన ఆరోపణల నుంచి దృష్టిని మళ్లించేందుకే వారు ఈ దాడి చేశారని ఆయన ఆరోపించారు. ప్రజల్లో భయం నెలకొల్పే ప్రయత్నంగా, మీడియా స్వేచ్ఛను అణచివేసే చర్యగా దీన్ని ఖండించారు. ప్రత్యేకంగా బీఆర్ఎస్‌కు గతంలో మద్దతుగా ఉన్న మహా న్యూస్ ఛానెల్‌పైనే (Mahaa News Channel) ఈ దాడి జరగడం ఎంత దారుణమో అని వ్యాఖ్యానించారు.

    READ ALSO  CM Revanth Reddy | దత్తాత్రేయను ఉప రాష్ట్రపతి చేయాలి.. సీఎం కీలక వ్యాఖ్యలు

    ‘మీరు కెమెరాలు పగులగొట్టగలరు కానీ నిజాన్ని కాదు. గొంతులను మూయించగలరు కానీ ప్రశ్నలను ఆపలేరు. ఛానెల్‌పై దాడి చేయవచ్చు కానీ జర్నలిజాన్ని అంతం చేయలేరు,” అంటూ బండి సంజయ్ (Bandi Sanjay) హెచ్చరించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూడా దీనిని తీవ్రంగా ఖండించారు. మీడియా సంస్థలు ప్రసారం చేసే వార్తల‌పై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే, వాటిని తెలియజేయడానికి నిర్దిష్టమైన, ప్రజాస్వామ్యబద్ధమైన పద్ధతులు ఉంటాయని, ఇలా కార్యాల‌యాల‌పై దాడులు చేయ‌డం స‌మంజ‌సం కాద‌ని అన్నారు. చంద్ర‌బాబు (CM Chandra babu) కూడా దీనిని ఖండిస్తూ ఇది అత్యంత దారుణమైన చర్య అని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి హింసాత్మక ఘటనలకు చోటు లేద‌ని అన్నారు. బెదిరింపులు, దాడుల ద్వారా మీడియా గొంతును నొక్కేయాల‌ని చూస్తే సమాజం ఎప్పటికీ అంగీకరించదని అన్నారు. మ‌రోవైపు ప్రజల గొంతుకను వినిపించే మీడియా సంస్థలపై దాడులు చేయడాన్ని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా పరిగణించాలంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) పేర్కొన్నారు.

    READ ALSO  Malnadu Drugs Case | నైజీరియన్​ డాన్​తో కలిసి డ్రగ్స్​ సరఫరా.. ‘మల్నాడు కేసు’లో కీలక విషయాలు

    Latest articles

    Kamareddy congress | దళిత సీఎం మాట మార్చిన ఘనత బీఆర్​ఎస్​ది..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy congress | తెలంగాణ రాష్ట్రం వస్తే దళితున్ని సీఎం చేస్తామని హామీ ఇచ్చి మర్చిపోయిన...

    Education Department | పైసలిస్తేనే పర్మిషన్​..!

    అక్షరటుడే, ఇందూరు : Education Department | జిల్లా విద్యాశాఖలో (district education department) పలువురు సిబ్బంది తీరుపై...

    Special Officer | ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారిగా రాజీవ్​గాంధీ హనుమంతు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Special Officer | ఉమ్మడి నిజామాబాద్​ (Nizamabad) జిల్లా ప్రత్యేకాధికారిగా ఐఏఎస్​ అధికారి రాజీవ్​గాంధీ...

    Sp Rajesh chandra | ఫిర్యాదులపై వేగంగా స్పందించాలి

    అక్షరటుడే, బాన్సువాడ: Sp Rajesh chandra | ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని ఎస్పీ రాజేష్...

    More like this

    Kamareddy congress | దళిత సీఎం మాట మార్చిన ఘనత బీఆర్​ఎస్​ది..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy congress | తెలంగాణ రాష్ట్రం వస్తే దళితున్ని సీఎం చేస్తామని హామీ ఇచ్చి మర్చిపోయిన...

    Education Department | పైసలిస్తేనే పర్మిషన్​..!

    అక్షరటుడే, ఇందూరు : Education Department | జిల్లా విద్యాశాఖలో (district education department) పలువురు సిబ్బంది తీరుపై...

    Special Officer | ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారిగా రాజీవ్​గాంధీ హనుమంతు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Special Officer | ఉమ్మడి నిజామాబాద్​ (Nizamabad) జిల్లా ప్రత్యేకాధికారిగా ఐఏఎస్​ అధికారి రాజీవ్​గాంధీ...