HomeUncategorizedCM Chandra Babu | జ‌గ‌న్ ఒక వింత జీవి.. డ్రామాలాడితే తడాఖా చూపిస్తామంటూ చంద్ర‌బాబు...

CM Chandra Babu | జ‌గ‌న్ ఒక వింత జీవి.. డ్రామాలాడితే తడాఖా చూపిస్తామంటూ చంద్ర‌బాబు వార్నింగ్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: CM Chandra Babu | ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధ‌వారం మీడియా సమావేశం నిర్వహించారు. అయితే ఈసారి ఆయన రొటీన్‌కి భిన్నంగా, ఫుల్ ఖుషీ మూడ్‌లో, నవ్వులు పూయిస్తూ, ఘాటుగా మాట్లాడారు.

ముఖ్యంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) ను టార్గెట్ చేస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు స్పష్టంగా స్పందించారు. ప్రతిపక్ష హోదా ఎప్పుడు ఇస్తారో? ముందుగా ప్రజాస్వామ్యం అంటే ఏంటో నేర్చుకోవాలి జగన్! అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.అలాగే, అసత్య ప్రచారాల ద్వారా ప్రజలను మోసం చేయొద్దని హెచ్చరించారు.

CM Chandra Babu | చంద్ర‌బాబు వార్నింగ్..

తమ పాలనపై దుష్ప్రచారాలు చేస్తే “తడాఖా అంటే ఏంటో చూపిస్తాం” అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జగన్ ఇటీవల పులివెందుల పర్యటనలో ఉల్లి, చీని రైతులతో నిర్వహించిన సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు(CM Chandra Babu) ఆగ్రహం వ్యక్తం చేశారు.“మీరు అధికారంలో ఉన్నప్పుడు పులివెందులకు నీళ్లు కూడా ఇవ్వలేకపోయారు. ఇప్పుడు డ్రామాలు చేస్తారా?” అంటూ సెటైర్లు వేశారు. సాధారణంగా మీడియా సమావేశాల్లో కూల్‌గా, నిశ్చలంగా మాట్లాడే చంద్రబాబు, ఈసారి మూడ్ మారిపోయింది. వైసీపీపై ఎదురుదాడి, వార్నింగ్‌లు, సెటైర్లు అన్నీ కలిపి మాస్ లీడర్ మానరిజం తో కనిపించారు.

తాను జగన్‌ను గట్టిగా ఎండగట్టినప్పటికీ, టీడీపీ నాయకులు(TDP Leaders) సంయమనం పాటించాలనీ, వైసీపీ ప్రవర్తనకు ప్రోత్సాహం ఇవ్వొద్దని చంద్రబాబు స్పష్టం చేశారు. “కొంతమంది వైసీపీ నేతలు కావాలనే రెచ్చగొడుతున్నారు, అయితే మీరు రెచ్చిపోవద్దు” అంటూ హితవు పలికారు.హెరిటేజ్ అవుట్‌లెట్లు ఎక్కడైనా ఉన్నాయా? అలా చెప్పే వారికి బుద్ధి, జ్ఞానం ఉండాలి క‌దా, వీరంతా కూడా విచిత్రమైన వింత జీవులు వాళ్లు.. వారిని ఏం చేయాలి? అయినా కొంతమంది అది నిజమని, అవుట్‌లెట్లు ఉన్నాయని నమ్ముతారేమో? అంటూ చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. రాజకీయ విలువలు పతనావస్థకు చేరిన‌ప్పుడు, ఇలాంటి విలువలు లేని వ్యక్తులు వ‌ల‌న‌ ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ ప్రజల కోసం దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి. ఎదుర్కోవడమే కాదు, ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి. అది మేము చేసి తీరుతామ‌ని చంద్రబాబు పేర్కొన్నారు.