Homeజిల్లాలుకామారెడ్డిDurga Matha | ఘన్​పూర్​లో ఘనంగా చండీయాగం

Durga Matha | ఘన్​పూర్​లో ఘనంగా చండీయాగం

అక్షరటుడే, డిచ్​పల్లి : Durga Matha | మండలంలోని ఘనపూర్ గ్రామంలో దుర్గామాత మండపం వద్ద ఆదివారం చండీయాగం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో దుర్గామాత మండప నిర్వాహకులు, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.

Durga Matha | ఎల్లారెడ్డిలో..

అక్షరటుడే, ఎల్లారెడ్డి : పట్టణ కేంద్రంలోని ముత్యాల పోచమ్మ ఆలయంలో చైతన్య యూత్, హిందూ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపంలో అమ్మవారు ఆదివారం మహచండీ దేవి రూపంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ప్యాలాల రాములు, సంగమేశ్వర్, పప్పు వెంకట్, రమేష్, ప్రభాకర్, శివప్రసాద్, విద్యాసాగర్, నవీన్, అర్జున్ గౌడ్, సాయి, భాను, అర్జున్, ఫణి, కిరణ్, రాహుల్, సూర్య, కపిల్, తరుణ్, సాయిరాజ్, భాస్కర్, మధు, చందు, సంజయ్, ఈశ్వర్, వినీత్, నాగబాబు, సన్నీ, నిహాల్​ పాల్గొన్నారు.

Must Read
Related News