- Advertisement -
HomeతెలంగాణKaleswaram ENC | చంచల్‌గూడ జైలుకు కాళేశ్వరం ఈఎన్​సీ హరిరామ్

Kaleswaram ENC | చంచల్‌గూడ జైలుకు కాళేశ్వరం ఈఎన్​సీ హరిరామ్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Kaleswaram ENC | ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టయిన కాళేశ్వరం ఈఎన్​సీ హరిరామ్​నకు కోర్టు 14 రోజుల రిమాండ్(Remand)​ విధించింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో శనివారం ఏసీబీ అధికారులు ఈఎన్సీ భూక్యా హరిరామ్‌(ENC Bhukya Hariram) ఇళ్లలో సోదాలు చేశారు. తనిఖీల్లో భాగంగా ఆయనకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో, బంధువుల నివాసాల్లో ఏక కాలంలో 14 చోట్ల సోదాలు నిర్వహించారు. దాదాపు ఆయన పేరు మీద రూ.200 కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించారు. శనివారం అర్ధరాత్రి ఆయనను కోర్టు(Court)లో ప్రవేశ పెట్టగా జడ్జి 14 రోజుల రిమాండ్​ విధించారు. దీంతో ఏసీబీ అధికారులు(ACB Officers) ఆయనను చంచల్​గూడ జైలు(Chanchalguda Jail)కు తరలించారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News