ePaper
More
    HomeతెలంగాణWeather Updates | నేడు పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం

    Weather Updates | నేడు పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) అధికారులు తెలిపారు. ఉదయం నుంచి వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. సాయంత్రం తర్వాత పలు చోట్ల తేలికపాటి వాన పడే ఛాన్స్​ ఉంది. హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో చెదురుమదురు వర్షాలు పడతాయి.

    Weather Updates | దంచికొట్టనున్న వానలు

    రాష్ట్రంలో ఆగస్టు 7 వరకు వాతావరణం పొడిగా ఉండనుంది. ఆ తర్వాత భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆగస్టు 7, 8 తేదీల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.

    Weather Updates | జోరుగా వ్యవసాయ పనులు

    రాష్ట్రంలో మూడు రోజుల క్రితం వరకు భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. బోరుబావుల కింద వరినాట్లు గతంలోనే వేయగా.. వర్షంపై ఆధారపడిన రైతులు (Farmers) ప్రస్తుతం సాగు పనుల్లో బిజీ అయిపోయారు.

    READ ALSO  Weather Updates | నేడు రాష్ట్రానికి వర్ష సూచన

    Weather Updates | అక్కడ కళకళ.. ఇక్కడ వెలవెల

    ఎగువన కురిసిన వర్షాలతో కృష్ణానదికి భారీగా వరద వస్తోంది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఆ నదిపై ఉన్న అన్ని ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. వచ్చిన నీటిని వచ్చినట్లు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. జూరాల, శ్రీశైలం, నాగర్జున సాగర్​, పులిచింతల ప్రాజెక్ట్​లు కళకళలాడుతున్నాయి. దీంతో వరద గేట్ల ద్వారా దిగువకు నీటిని వదులుతున్నారు.

    మరోవైపు ఎగువన గోదావరిలో నీరు లేక వెలవెలబోతుంది. నాలుగైదు రోజులు కురిసిన వర్షాలతో శ్రీరాంసాగర్​ ప్రాజెక్ట్​లోకి కొంత మేర నీరు వచ్చింది. శ్రీరాం​సాగర్​ నిండితే వరద కాలువ ద్వారా మిడ్​ మానేర్​, లోయర్​ మానేర్​ డ్యామ్​లకు నీటిని తరలించే అవకాశం ఉంది. ప్రాజెక్ట్​లోకి ప్రస్తుతం స్వల్ప ఇన్​ఫ్లో మాత్రమే నమోదు అవుతోంది. మరోవైపు మంజీర నదిపై గల సింగూరు, నిజాంసాగర్​ జలాశయాలకు వరద లేక వెలవెలబోతున్నాయి.

    READ ALSO  Double Bed Room Houses | డబుల్ బెడ్​ రూం ఇళ్లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు.. ఇద్దరి అరెస్ట్

    Latest articles

    School inspection | చంద్రాయన్​పల్లి ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో

    అక్షరటుడే, ఇందల్వాయి: School inspection | మండలంలోని చంద్రాయన్​పల్లి గ్రామంలో (Chandrayanpalli village) గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను...

    Meenakshi Natarajan | మీనాక్షి నటరాజన్​ పాదయాత్రలో మార్పులు.. మారిన షెడ్యూల్​ వివరాలివే..

    అక్షరటుడే ఆర్మూర్ : Meenakshi Natarajan | కాంగ్రెస్​ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan)​,...

    PM Kisan | రైతులకు గుడ్​న్యూస్​.. నేడు పీఎం కిసాన్ నిధులు విడుదల

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Kisan | కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. 20వ విడత...

    IND vs ENG | ర‌ఫ్ఫాడించిన భార‌త బౌల‌ర్స్.. టీమిండియా ఎంత ఆధిక్యంలో ఉందంటే!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IND vs ENG | ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో టీమిండియా(Team India) బౌలింగ్‌తో...

    More like this